Home ఎడిటోరియల్ రేపు తెలుస్తుంది

రేపు తెలుస్తుంది

Votersబీహార్‌లో మొన్న చివరి దశ పోలింగు జరి గింది. ఈ ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా వందకుపైగా సభల్లో పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ఎటుమొగ్గు చూపారో రేపు తెలిసిపోతుంది. మూడింట రెండువంతుల మెజారిటీ లభించడం ఖాయమని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు గానీ అంతసీన్ వున్నట్లు కనబడటం లేదుట!
‘మహాగడ్బంధన్’ ముస్లిం -యాదవ్-ఓబీసీ ఓటు బ్యాంకును పూర్తిగా నమ్ముకుంది. అయితే తొలిదశల పోలింగ్ తరువాత బిజెపి తన వ్యూహాన్ని మార్చుకోక తప్పలేదు. ప్రధాని కూడా స్వయంగా సభలలో పాల్గొన్నప్పుడు యధారీతి జనం పెద్ద సంఖ్యలో హాజరుకావడం, యువత అధికంగా తరలి రావడం బిజెపి గెలుపు నమ్మకాన్ని సజీవం చేసిన మాట వాస్తవం! బీహార్ ఎన్నికల ఫలితాలతో నరేంద్రమోడీ కేంద్రంలోని ప్రభుత్వ పనితీరును ముడిపెట్టలేమని బిజెపి ఎంత బీరాలు పలుకుతున్నా ఫలితాలు వచ్చినప్పుడు ఈ అనుకూల, అననుకూల వాదన అతిసహజంగా పైకివస్తుంది. హిందువుల ఓట్లు చీలిపోకుండా ఆరెస్సెస్ కార్యకర్తలు పట్టుదల గానే ప్రచారం చేశారు. లాలూతో బాటు ఆయన ప్రత్యర్థి పప్పూయాదవ్ ప్రభావమూ తేలికగా తీసిపారేయవలసిందికాదు.
తొలి నాలుగు దశల పోలింగ్ కన్నా మొన్న జరిగిన చివరి దశ పోలింగ్‌కు పరిగణన మరీ ఎక్కు వగా వచ్చింది. కారణం ముస్లిం జనాభా అధికంగా వున్న సీమాంచల్ ప్రాంతంలోని 24 స్థానాలతో సహా మొత్తం యాభై ఏడు స్థానాలకు చివరి పోలింగు పోరు సాగింది. లాలూప్రసాద్ యాదవ్ మొదలైన వారు ‘బీఫ్’పైచేసిన వ్యాఖ్యలతో తయారు చేసిన బిజెపి ప్రకటన వివాదాస్పదమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు దాకా వెళ్ళింది. ఆ ప్రకటనలను నిషేధిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్‌గా తీసుకోవడంవల్లనే ఆయన పలు మార్లు సుడిగాలి పర్యటనలు చేసి మూడు పదులకు పైగా సభల్లో ప్రసంగించారు. లాలూ, నితీశ్, సోనియాలను వీలున్నచోటల్లా నిశితంగా విమర్శిం చారు. ముఖ్యంగా ముస్లింల విశ్వాసాలు, వారి ఆహా రపు అలవాట్లుపై ప్రతిఘటనలు ఎక్కువయ్యాయన్న భావన విస్తృతమయింది. ఆహార ఫాసిస్టు దాడులు పాలకవర్గాల కుట్రల పర్య వసాన మేననీ, సామాజిక సంబంధాల్లో చీలి కలద్వారా అధి కార సుస్థిరతకు కేంద్రం ప్రయత్ని స్తున్నదనే వాదన ఒకటి బలంగా రేగు తోంది. భార తీయ ఆహార మార్కెట్‌ని బహుళ జాతి సంస్థలకు ధారాదత్తం చేసే దిశగానే హిందూత్వ పేరుతో బరి తెగింపు సాగు తోందనే అభిప్రా యం వేళ్లూను తోంది.
మతాహం కార పాలనలోని ఫాసిస్టు ధోర ణు లకు వ్యతిరేకంగా మేధా వులూ, రచయితలూ తా ము గతంలో పుచ్చు కున్న అవార్డులను కొందరు తిరిగి ఇస్తున్నట్లుగా ప్రక టించడం, సినిమా సెలబ్రిటీలయిన షారుఖ్‌ఖాన్, కమల్‌హాసన్ వంటి వారు కూడా ఈ వివాదంలో తమ భావ ప్రకటనలు చేయడం, ప్రభుత్వ కార్యాచరణను ఎవరు ఎలా ప్రశ్నిస్తారన్నది వారి వారి ఇష్టమే! కానీ నిరసన గళం బలంగా వున్నప్పుడే సామాన్యుడు సైతం ఆలోచిస్తాడు. అందునా మార్పుకు అవకాశం వున్న ఎన్నికలలో తన ఓటు ఆయుధాన్ని ప్రయుక్తం చేయ డానికి దేశంలో ఏర్పడిన వాతావరణం, జరుగు తున్న చర్చలు తప్పకుండా ప్రభావం చూపు తాయి. మతతత్త ధోరణి తెచ్చే బీభత్సం ఏదయినా అనాగ రికమే! అది అందరూ గ్రహించాల్సిందే. బీహార్ ఎన్నికల్లో ఈ పరిస్థితుల ప్రభావం ఎలా వుంటుందో గాని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్‌లపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు తెచ్చాయి. దానితో పార్టీ విజయావకాశాలకోసం మల్లగుల్లాలు పడి తాము రిజర్వేషన్లకు కట్టుబడి వున్నామని అదే పనిగా ప్రక టించు కోవాల్సి వచ్చింది. తాను బీసీల అభివృద్ధికి గుజరాత్ ముఖ్యమంత్రిగా పాటుపడ్డానని మోదీసైతం చాటింపు వేసు కోవాల్సి వచ్చిం ది. బీహార్ ఎన్ని కల ఫలితాలు బిజెపి ప్రభుత్వా నికి రెఫరెండంగా వుండబోతాయో లేదోగాని ఒక నిర్ణయాత్మక శక్తిని ప్రతి బింబి స్తా యనే మాట మటుకు ఉంది. బీహార్‌కు లక్ష న్నరకోట్ల ప్యాకేజీ ప్రక టించడం దగ్గర నుంచి అనేక వ్యూహాలు పన్ని బిజెపి ఆఖ రికి గోమాతను కూ డా అడ్డం పెట్టు కుంది గెలుపు కోసం. నితీశ్ కుమార్ వికాస్‌ను ప్రజలు నమ్ము తున్నారని తెలియరావడంతో కులాల లెక్క లతో కుస్తీలు పట్టడం ముం దుకు వచ్చిం ది.
ఏమైతేనేం బీహార్ ఫలితాల పట్ల నిరీక్షణా సక్తి ఇప్పుడు ఇబ్బడిముబ్బడి గా ఉంది. వామ పక్షాలు, బిఎస్‌పి, ఎస్‌పి, మజ్లిస్, ఎన్సీపి వంటి పార్టీలు కూడా బీహార్ ఎన్నికలలో నిలిచాయని మరిచి పోకూడదు.
ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో జరుగుతూనే వుంటుంది. అవాంఛనీయ సంఘటనలను ఆసాంతం నిరోధించడం ఎవరి వల్లాకాదు అనడం సులభమే! కానీ జనం చూసేది అలాంటి ఘటనల పట్ల ప్రభుత్వ స్పందన ఎలా ఉందనేదే! ఎన్నికలు కూడా – ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది.
ఫలితాలకు మేం బాధ్యులం కాము అని త్రోసిరాజనలేరుకదా! ప్రజాభి ప్రాయ ప్రకటనకు ఓటింగ్ అనేదే తిరుగులేని మరో ప్రత్యామ్నాయంలేని ప్రజాస్వామిక సంవిధానం. పరిస్థితులు కాలాను గుణంగా మారుతుంటాయి. బలపడేవి కొన్నయితే, బలహీనపడేవి కొన్ని. విశ్వాసాన్ని ప్రోదిచేసేవి కొన్నయితే, అభద్రతను తలపించేవి ఇంకొన్ని. ప్రజలు తమ నిఘానేత్రం మూసుకు కూర్చుం టారనుకోవడం తప్పు. నిజానికి ‘రీకాల్’ విధానమే వుండివుంటే పనితీరు మరోలా వుంటుంది. ఒకసారి అధికారం కట్టబెట్టాక అయి దేళ్ళ వరకూ మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధీమా, భరోసా కూడా సరికాదు. ప్రజలు తలుచు కుంటే మధ్యంతరాలు వస్తాయి. ఏ అభ్యంతరాలు వచ్చినా చైతన్య ధనుష్పాణులైన ప్రజలు అదనుచూసి ఎవరికి ఎప్పుడు ఏ గుణపాఠాలు చెప్పాలో అవి చెప్పే తీరుతారు.‘బీఫ్’-‘ఆహార్’ మొదలయినవాటి ప్రతిస్పందనలూ ‘బీహార్’ ఫలితాలు రుచిచూపు తాయని ప్రజా స్వామిక వాదులు ఎదురుచూస్తు న్నారు. ఎవరికి హారాలో, ఎవరికి చీడీలో ఎలాగూ తేటతెల్లమవు తుంది. ఎగ్జిట్‌పోల్స్ కూడా ఏమీ స్పష్టంగా తేల్చ నందున ఉత్కంఠ మరీ హెచ్చింది.
-9849297958