Home కెరీర్ రెజ్యూమె రాసుకోండి… మేమున్నాం

రెజ్యూమె రాసుకోండి… మేమున్నాం

రెజ్యూమె. ఇది ఉద్యోగ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి అత్యవసరం. చాలామందికి బయోడేటాకి, రెజ్యూమెకి తేడా తెలీదు. ముందు అది తెలుసుకోవడం ముఖ్యం. చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా, చేస్తున్న ఉద్యోగం మారాలన్నా, రెజ్యూమె చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తంది. కాని దాన్ని రాసుకోవడం పెద్ద సమస్య అవుతుంది. తను కావాలనుకుంటున్న ఉద్యోగానికి ఏ తరహాలో రెజ్యూమె తయారు చేసుకోవాలో ఎవరూ చెప్పేవారు లేరు. ఉద్యోగం రాకపోవడానికి రెజ్యూమె కూడా కారణం అవుతుందని చెప్తూ రెజ్యూమె తయారు చేసుకోవాలా మేం సహాయం చేస్తాం రండి అంటున్నారు ఫణిశ్రీ, నాగరాజు ఇద్దరూ జట్కా డాట్ ఇన్ వెబ్‌సైట్ ద్వారా రెజ్యూమె రాసుకోడానికి సహకరిస్తారు.. 

Resume1

నేను ఆంద్ర యూనివర్శిటీ నుంచి ఎమ్‌బిఎ చేశాను. ఆరున్నర సంవత్సరాలు రిక్రూట్‌మెంట్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఉద్యోగంలో బాధ్యతగా చాలామంది అభ్యర్థులను పిలవడం, ఇంటర్వూ చేయడం జరిగేది. మేం ఉద్యోగంలో ఉన్నప్పుడు, తర్వాత మేం కంపెనీ పెట్టినప్పుడు కూడా కంపెనీలకు రిక్రూట్‌మెంట్ సపోర్ట్ చేస్తుంటాం. అభ్యర్థులకు వారిని వారు ఎలా ప్రెజంట్ చేసుకోవాలో తెలియట్లేదు. ఈ అవసరాలను భర్తీ చేస్తూ ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలని అనుకున్నాం. అటువంటి సేవలు అందించేవారు మార్కెట్లో ఉన్న ప్పటికీ 80 శాతం మందికి రెజ్యూమె తయారుచేసుకోవడంలో వైఫల్యం పొందుతున్నారు. వాళ్లంతట వాళ్లు రెజ్యూమె తయారు చేసుకోవడం రావట్లేదు. పక్కవాళ్ల రెజ్యూమె తీసుకుని పేర్లు మార్చి కాపీ పేస్ట్ చేసి పంపిస్తారు.

ఎవరి రెజ్యూమె అయితే కాపీ చేస్తారో వీరికి కూడా అవే నైపుణ్యాలు ఉండాలని లేదు. దాని వలన కంపెనీకి, అభ్యర్థికి ఇద్దరికీ సమయం వృధా అవుతుంది. పూర్తి పరిశోధన చేసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేశాం. ఉద్యోగం వదిలేసి ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా భయం అనిపించలేదు. మాకు తెలిసిన పనే చేస్తున్నాం. అందరికీ మేలు కలుగుతుంది. ఉద్యోగాలొస్తే అందరు సంతోషంగా ఉంటారు. ఆ ఆలోచన బాగా అనిపించింది. చాలా కొద్ది పెట్టుబడితో ఆరంభించాం. కాని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్లడానికి చాలా పెట్టుబడి కావల్సి వస్తుంది. దేశం మొత్తంలో అన్ని వర్గాల ఉద్యోగాల వారికి ఉద్యోగం దొరకాలి. రెజ్యూమె వలన ఉద్యోగాలు పోగొట్టుకోకూడదు అన్నదే మా ఉద్దేశ్యం. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ నుంచి డొమెయిన్ నిపుణులు ఉంటారు. వాళ్ల దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని డిజైన్ చేసి పెడతాం.

ఒక ఇండస్ట్రీకి, ఒక అనుభవ స్థాయికి పరిమితం చేయకుండా ఒక ప్రాంతానికి, భాషకి పరిమితం చేయకుండా అందరికీ ఈ సేవ అందేలా చూస్తున్నాం. మొదలుపెట్టి ఆరునెలలు అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ముందుగా హైదరాబాద్‌లో ఆరంభించాం. తర్వాత బెంగుళూరు, చెన్నైల్లో కూడా ఆఫీసులు పెట్టాలనుకుంటున్నాం.

కంపెనీలు వాళ్లు పోస్టింగ్ వేసినప్పుడు కుప్పల కొద్దీ రెజ్యూమెలు వస్తాయి. వాటిలో వారికి అవసరమైనవి కొన్నే ఉంటాయి. కొంతమంది చిన్నప్పుడు చెస్ పోటీల్లో పాల్గొన్నాం అని , క్యారమ్స్ గెలిచాం అని, ఇటువంటి అనవసరమైన విషయాలన్నీ రెజ్యూమెలో పెడుతుంటారు. కాని ఉద్యోగానికి వచ్చేసరికి ఇవన్నీ అవసరం కాదు. వారికి కావలసిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో చూస్తారు. అందుకే కంపెనీలకు ఒక ఫార్మాట్ ఇస్తాం. ఆ ఫార్మాట్‌లో అభ్యర్థుల రెజ్యూమె ఇవ్వమని వారు కోరతారు.

చాలామందికి రెజ్యూమె అని పెట్టడం తెలీదు. బయోడేటా అంటారు. అలా అనకూడదు. రెజ్యూమె అంటేనే తెలియనివారికి ఉద్యోగం ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు. ఆ పరిపక్వత స్థాయి. అవగాహన, ఉద్యోగం కావాలనుకునేవారిలో తేవాలని మా ఉద్దేశ్యం. ఇంకా ముందు ముందు ఇంటర్వూ టిప్స్ ఇవ్వడం లాటివి కూడా చెయ్యాలనుకుంటున్నాం.

ఐటి ఇండస్ట్రీలో రిక్రూట్‌మెంట్ పెద్ద స్థాయిలో జరుగుతుంది. మిగతా రంగాల్లో తక్కువ ఉంటుంది. ఏ రంగం వారయినా చాలామంది ఐటి రంగానికే వెళ్దామని చూస్తున్నారు. ఐటిలో డిమాండ్ అండ్ సప్లైలో చాలా విభిన్నతలుంటాయి. ఒక్కోచోట లక్షమంది పోటీ పడతారు. ఒక్కోదానికి అసలు అభ్యర్థులు దొరకరు . నాన్ ఐటితో పోలిస్తే ఐటి రిక్రూట్‌మెంట్‌లు క్లిష్టం. ఐటికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలుండాలి. ప్రతి రంగానికి చెందిన నిపుణుల నుంచి అవసరాలకు తగ్గట్టు ఎలా కావాలో సూచనలు, సలహాలు తీసుకుని పెడతాం. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి ఆరు నెలలు పట్టింది. ఆలోచనలు చర్చించుకుంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉండాలి. రిక్రూట్‌మెంట్ కంపెనీ లాగా ఆరంభించాం. మధ్యలో ఈ ఐడియాని అమలు చేశాం. కంపెనీల మధ్య దీన్ని విడుదల చేశాం.

ప్రభుత్వంతో టైఅప్ అయి ఆర్‌బిఐ, యుపిఎస్‌సి, గ్రూప్ వన్, గ్రూప్ టు పరీక్షలకు హార్డ్‌కాపీ అప్లికేషన్ పూర్తి చేస్తున్నారు. అలా కాకుండా ఆన్‌లైన్ అప్లికేషన్‌ను చేసేటట్లుగా మా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. కాలేజీల్లో ఫ్రెషర్లు రెజ్యూమెలో టెన్త్, ఇంటర్, బిటెక్ చదివిన సంవత్సరం రాస్తారు, చేసిన ప్రాజెక్ట్ పెడతారు అంతే. అది చూస్తే ఉద్యోగం ఇచ్చేవారికి వాళ్ల గురించి ఏం అర్థం అవుతుంది. ఇంటర్వూలకు వెళ్లినప్పుడు ఎవరి రెజ్యూమె వాళ్లు రాసుకుంటే తమ గురించి తాము చెప్పుకోగలరు. అందుకే వాళ్లంతట వాళ్లు తమ నైపుణ్యాల గురించి విశ్లేషించుకుని రాసుకోవాలి. ఇప్పటివరకు హైదరాబాద్‌లో టాప్ టెన్ కాలేజీలకు వెళ్లాం. సాధారణంగా ఇబ్బంది వచ్చేది పెద్ద కాలేజీలకే. అక్కడ చదివినవారందరూ మేం చాలా సామర్థం కలవారం అనుకుంటారు. వాళ్లు కూడా కాపీ పేస్ట్ మీదనే ఆధారపడుతుంటారు.

రెజ్యూమె అంటే ఏంటి? ఉద్యోగం సంపాదించాలంటే అది ఎంత ఉపయోగం అని కాలేజీల్లో చెప్తుంటాం. అటువంటి వివరాలన్నీ పొందుపరచి విడియోగా విడుదల చేశాం. బలహీనతలు, బలాలు రాయమంటే నా తల్లిదండ్రులు నా బలహీనతఅని రాస్తుంటారు. కాని అది కంపెనీకి ఉపయోగపడే విషయం కాదు. ఎప్పుడూ కంపెనీ ధృక్పథంలో చూడాలి కాని వ్యక్తిగతం రాయకూడదు.

ఒక ఉద్యోగం చెయ్యాలంటే నీ బలం ఏంటి? ఏవిధంగా స్ట్రెచ్ అవగలవు? గ్రూప్‌తో పనిచేయగలవా లేదా వంటివి కంపెనీకి ఉపయోగపడే సమాచారం. అది దృష్టిలో పెట్టుకుని రెజ్యూమె రాయాలి. కాలేజీల్లో కూడా శిక్షణ ఇస్తారు. కాని ఆ శిక్షణ ఎక్కడ వరకు ఉంటుందంటే ఇంటర్వూకి బట్టి పట్టి చెప్పేట్టుగా ఉంటున్నాయి. దాని వలన అందరూ ఒకే విధమైన జవాబులు చెప్తారు. కంపెనీవాళ్లకు ఎవరి నైపుణ్యాలు ఏవో అర్థం కావు. ఎవరిని వారు ఏవిధంగా ప్రెజెంట్ చేసుకోవాలి అని చెప్పడానికే జట్కా డాట్ ఇన్ పనిచేస్తుంది. మా అనుభవంలో అభ్యర్థులు, రిక్రూటర్లు ఇద్దరినీ దగ్గరగా చూశాం. వాళ్లిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ని పూర్తి చేయడానికే ప్రయత్నం.