Search
Saturday 17 November 2018
  • :
  • :

దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

retails

న్యూఢిల్లీ : వరుసగా మూడో నెల మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. ఆహార ధరలు తగ్గడంతో మార్చి మాసంలో వినిమయ ధరల సూచి(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.28 శాతంగా నమోదవగా.. గత ఏడాది ఇదే నెలలో 5.07 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి నమోదైంది. గురువారం కేంద్ర గణాంకాల శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరి మాసంలో 7.1 శాతానికి క్షీణించింది. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. కూరగాలయల ద్రవ్యోల్బణం మార్చిలో 11.7 శాతం నమోదవగా.. అంతకుముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. ఇలాగే గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తులు వంటి పౌష్టికాహారంలో ధరల పెరుగుదల మోస్తరుగా ఉంది. పండ్లలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఆహార ధరల్లో ద్రవ్యోల్బణం 3.26 శాతంతో పోలిస్తే 2.81 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.
అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన విభాగంలో కూడా నెలవారీగా ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఏప్రిల్-సెప్టెంబర్‌లో 4.7 నుంచి 5.1 శాతంగా ఆర్‌బిఐ నిర్ణయించింది. ఆహార ధరల పెరుగుదలలో చోటుచేసుకుంటున్న తీవ్ర మార్పుల మధ్య ఆర్‌బిఐ ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాల్ని మరింత తగ్గించుకున్నది. వచ్చే ఆర్‌బిఐ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రస్తుత గణాంకాలు దోహదం చేస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

comments