Search
Wednesday 26 September 2018
  • :
  • :

2.18 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం

  • ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గడమే కారణం
  • 2012 కనిష్ఠ స్థాయికి చేరిన సూచీ

inflation

న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి రెండూ వృద్ధి దిశగా పయనిస్తున్నాయి. కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో మే నెలలో రిటైల్ ద్రవ్యో ల్బణం కనిష్టానికి పడిపోయింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యో ల్బణం మే నెలలో 2.18 శాతంగా నమోదైంది. ఇది ఏప్రిల్ నెలలో 2.99 శాతంగా ఉంది. 2012 సంవత్స రంలో ఉన్న కనిష్ఠ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుం ది. వరుసగా ఏడో నెల ఆర్‌బిఐ మధ్యకాలిక లక్షం 4 శాతం కంటే దిగువనే ద్రవ్యోల్బణం నమోదైంది. రిటైల్ ఆహార ధరలు గత ఏడాదితో పోలిస్తే 1.05 శాతానికి పడిపోగా, ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.61 శాతానికి చేరుకు న్నాయి. పండ్ల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, కూర గాయలు ధరలు తగ్గడం ద్రవ్యో ల్బణం కనిష్టానికి చేరడా నికి కారణమైంది. వస్త్రాలు, ఇంధనం, గృహాల రేట్లు కూ డా తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రాయి టర్స్ పోల్‌లో ఈ ద్రవ్యోల్బణం 2.60 శాతంగా ఉంటుం దని విశ్లేషకులు అంచనావే శారు. 2016 మే నెలలో రిటైల్ ద్రవ్యో ల్బణం 5.76 శా తం ఉంది. కూరగాయల ధరలు 13.44 శాతం కిందకి పడిపోయాయి. పప్పులు, ఉత్పత్తులు కూడా 19.45 శా తానికి దిగివచ్చాయి. ద్రవ్యోల్బణం పెరిగే అంచనాలతో రిజర్వు బ్యాంకు ఇటీ వల జరిగిన పాలసీ విధానంలో వడ్డీరేట్లను యథాతథం గా ఉంచింది. ప్రస్తుతం తగ్గిన ద్రవ్యోల్బణంతో ఆగస్టులో నిర్వహించబోయే సమావేశంలో కచ్చితంగా రేట్లను తగ్గి స్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించవచ్చని పేర్కొంటు న్నారు. రుతు పవనాలు మెరుగ్గా ఉంటే ఆహార ద్రవ్యో ల్బణం అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
3.1 శాతం పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) ఏప్రిల్ నెలలో 3.1 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల శాఖ (సిఎస్‌ఒ) విద్యుత్, గనులు, తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండడంతో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి దిశగా పయనిస్తోంది. మార్చి నెలలో ఐఐపి 3.1 శాతంతో పోలిస్తే ఏప్రిల్‌లో వృద్ధిని సాధించింది. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలో ఐఐపి 6.5 శాతంతో పోలిస్తే దిగువ నే ఉంది. మైనింగ్ 99.9, తయారీ రంగం 117.9, విద్యు త్ 150.6 శాతంగా నమోదైందని గణాంకాలు వెల్లడిం చాయి. మే నెలలో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.2 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గిం దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Comments

comments