Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రెండు సినిమాల తర్వాత రిటైర్మెంట్!

tarantinoక్వెంటిన్ టరాంటినో… ప్రపంచ అత్యుత్తమ డైరెక్టర్లలో ఒకరు. గత ఏడాది ‘ది హేట్ ఫుల్ ఎయిట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన రిటైర్‌మెంట్‌కు సమయం వచ్చేసిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  తన దర్శకత్వంలో వచ్చిన ఫల్ప్ ఫిక్షన్, జాంగో అన్ చైన్డ్ సినిమాలకుగాను బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డులను అందుకున్నాడు టరాంటినో. అయితే ఆయన తీసిన ప్రతి సినిమా ఎన్నెన్నో అవార్డులు దక్కించుకోవడం విశేషం. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే వంటివి ఎన్నో అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. తానింకా రెండు సినిమాలు మాత్రమే తీస్తానని ఈ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ తాజాగా ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తాను డైరెక్షన్ నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని చెప్పాడు క్వెంటిన్ టరాంటినో. రెండు సినిమా తర్వాత తన రిటైర్మెంట్ ఖాయమని ఆయన తెలిపాడు.

Comments

comments