Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పదవీ విరమణ వయస్సు 60కి పెంచాలి

 పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తం రెడ్డి

PRTU

మహబూబాబాద్ టౌన్: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60సంవత్సరాలకు పెం చాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి పాతపెన్షన్ విధానం పునరుద్ధ్దరించాలని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులి సరోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పిఆర్‌టియుటిఎస్ మహ బూబా బాద్ జిల్లా కార్యాలయాన్ని స్థానిక నెహ్రూసెంటర్‌లో ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్‌విఎం ఫంక్షన్ హాల్‌లో జరిగిన జిల్లా ప్రధమ కా ర్యనిర్వాహక వర్గ సమావేశంలతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లా సంఘ భవనానికి స్థలం సేకరిస్తే ఎంఎల్‌సి కోట నుండి రూ.20లక్షల నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో ఇక్కడి నుండే స్వర్గీయ సామాల యాదగిరి నాయకత్వంలో సంఘం ఏర్పడి రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘంగా ఆవిర్భవించిందన్నారు. అలాగే ఎన్నో ఉపాధ్యాయ సమస్యలను సాధించిన అతి పెద్ద సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడం అభినం దనీయ మన్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూ పొందించి పదోన్నతులు కల్పించాలని, రూ.398 వేతనంతో పనిచేస్తున్న స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, పిఆర్‌సి బకాయిలను నగదుగా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు ఉపేందర్‌రెడ్డి, ముర ళీధర్‌స్వామి, రాంమూర్తి, కృష్ణారెడ్డి, వెంకట్‌రాజు, గీత, లకా్ష్మరెడ్డి, నర్సింహారెడ్డి, సీతారాములు, వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు వరదరాజులు, ఉమ, ఓంకార్, రాంజీ, వెంకట్‌రెడ్డి, విజయకుమార్, శంకర్, ఈశ్వర్‌కుమార్, కనకయ్య, శర్మ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments