Search
Wednesday 14 November 2018
  • :
  • :

మాస్టర్ జెర్సీ నంబర్ 10కు రిటైర్మెంట్!

Tendulkarముంబయి: భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్‌లో ధరించిన జెర్సీ నంబర్ 10పై నెలకొన్న వివాదానికి భారత క్రికెట్ బోర్డు తెరదించింది. ఇకపై సచిన్ జెర్సీ నంబర్ 10 ఇతర క్రికెటర్లు ధరించకుండా నిషేధం విధిస్తున్నట్టు బోర్డు స్పష్టం చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతని సేవలకు గుర్తింపుగా ఆ జెర్సీని ఇతర క్రికెటర్లు ఉపయోగించకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా భారత క్రికెట్‌లో జెర్సీ నంబర్ 10 కనిపించదని, దానికి శాశ్వత రిటైర్మెంట్ ప్రకటిస్తున్న ఆ వర్గాలు వివరించాయి. భారత మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ జెర్సీ నంబర్ 10 అంటే అభిమానులకు ప్రాణం. ఆ జెర్సీ నంబర్ ధరించిన సచిన్ ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ జెర్సీ నంబర్ 10ను భారత యువ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ కల్పించడంపై పెద్ద వివాదమే నెలకొంది. బోర్డు తీసుకున్న ఈ చర్యపై సచిన్ అభిమానులు గుర్రుమన్నారు. వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇకపై ఎవరికి ఈ జెర్సీ నంబర్ కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని బోర్డును డిమాండ్ చేశారు. అభిమానుల నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో ఈ వివాదానికి శాశ్వతంగా తెరదించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ఎవరు కూడా ఈ జెర్సీ నంబర్ 10 ధరించకుండా ఆంక్షలు విధించింది.

Comments

comments