Home స్కోర్ పునరాగమనం సులువు కాదు

పునరాగమనం సులువు కాదు

 స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ

Rohith

ముంబయి: గాయం వల్ల సుదీర్ఘ కాలంపాటు జట్టుకు దూ రంగా ఉండి మళ్లీ పునరాగమనం చేయడం అనుకున్నంత సులువు కాదని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కిందటి సారి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ మధ్యలో తాను గాయానికి గురై జట్టులో స్థా నం కోల్పోయానని తెలిపాడు. గాయం మరి పెద్దదిగా కావడంతో శస్త్ర చికిత్స తప్పలేదన్నాడు. దీంతో తాను దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి పోవాల్సి వ చ్చిందన్నాడు. అయితే మళ్లీ జాతీయ జట్టులో చోటు కాపా డు కోవడం కోసం తాను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో గాయాల బారీన పడి మళ్లీ జట్టులో స్థానం సంపాదించడం అనుకున్నంత తేలిక కాదన్నాడు. పునరాగమనం కోసం తీవ్రంగా కష్ట పడాల్సి వస్తుందన్నాడు. గతంలో తాను చాలా సార్లు ఇలాంటి క్లిష్ట పర్థితిని తట్టుకొని ముందుకు వెళ్లానని తెలిపాడు. కాగా, వరుస గాయాలు తనను చాలా రోజుల వరకు పీడించాయన్నాడు. దీని ప్రభావం తన కెరీర్‌పై బాగానే పడిందన్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని రోహిత్ వివరించాడు. శ్రీలంక సిరీస్‌లో వరుస సెంచరీలు సాధించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కూడా మెరుగైన ఆటను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నాడు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికలు తన వద్ద ఉన్నాయన్నాడు. కాగా, లంకతో పోల్చితే ఆస్ట్రేలియాతో సిరీస్ చాలా క్లిష్టమైందన్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడూ ప్రమాదకర జట్టేనన్నాడు. వారిని ఓడించడం అనుకున్నంత తేలిక కాదన్నాడు. అయితే సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో టీమిండియాకే సిరీస్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు. కోహ్లి పర్యవేక్షణలో భారత జట్టు చాలా బలమైన శక్తిగా ఎదిగిందన్నాడు. తమను ఓడించాలంటే ఆస్ట్రేలియా అసాధారణ ఆటను కనబరచాల్సిం దేనని రోహిత్ అభిప్రాయపడ్డాడు.