Home తాజా వార్తలు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం

రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం

revanthreddyహైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు టిడిపి నేత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
శనివారం జూబ్లీహిల్స్‌లో మీడియాతో మాట్లాడితూ రేవంత్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆదివారం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎన్‌టిఆర్ భవన్‌ను ముట్టడించారు. అక్కడ వారిని టిడిపి నేతలు అడ్డుకోవడంతో భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం టిఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.