Home తాజా వార్తలు పవన్‌ను కెసిఆర్ రంగంలోకి దించారు…

పవన్‌ను కెసిఆర్ రంగంలోకి దించారు…

Revanth-Reddy

హైదరాబాద్ : ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే తెలంగాణ సిఎం కెసిఆర్ జనసేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పవన్ చేపట్టిన యాత్ర తన స్థాయికి తగ్గట్టుగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కెసిఆర్‌ను పొగడడం దురదృష్టకరనమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనేత వి.హన్మంతరావును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తే తాను ఆ పార్టీకి మద్దతు ఇస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. వి.హెచ్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని తమ అధినేత రాహుల్‌గాంధీకి పవన్ చెబితే బాగుంటుందని, పవన్‌ను తాను రాహుల్ వద్దకు తీసుకెళుతానని రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Revanth Reddy Comments On Pawan Kalyan