Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్.. రైతుల ఆత్మహత్యలపై మాట్లాడలేదేం..

Revanth-Reddy

హైదరాబాద్: సిఎం కెసిఆర్ తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ….  అమర వీరులు కుటుంబాలు, రైతుల కుటుంబాలు, నిరుద్యోగులను కెసిఆర్ లెక్కచేయడం లేదన్నారు. కెసిఆర్ బడిలో ఉండే విద్యార్థి కాదని, సచివాలయం ఉండకపోవడంతో పారిపాలనపై పట్టు దొరకడం లేదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో 30 నుంచి 40 శాతం లోటు ఉందన్నారు. గతేడాది కేంద్రం ఇండ్లకు ఇచ్చిన ఆరు వేల కోట్ల రూపాయలను కెసిఆర్ దారి మళ్లించారని విరుచుకపడ్డారు. రాష్ట్రంలో 4200 మంది రైతుల ఆత్మహత్య చేసుకుంటే రైతుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. రుణమాఫీకి సంబంధించిన వడ్డీ భారం రైతులపై 12 వేలు కోట్లు పడిందని, దీనిపై కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

Comments

comments