Home నాగర్ కర్నూల్ రేవంత్‌రెడ్డి రాకతో తెలుగుతమ్ముళ్లలో నూతనోత్సాహం

రేవంత్‌రెడ్డి రాకతో తెలుగుతమ్ముళ్లలో నూతనోత్సాహం

Revanth-Reddy1

అచ్చంపేట: నల్లమల అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల కేంద్రం లో బుదవారం నిర్వహించిన సభకు టిటిడిపి ఫైర్ బ్రాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెస్సిడెంట్ కొడంగల్ ఎం ఎల్‌ఎ ఏనుముల రేవంత్ రెడ్డి రాకతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం వచ్చింది. యురేనియం అనుమతులను నిరాకరిస్తు పార్టీ తరఫున నిర్వ హించిన సభ ఫుల్ జోష్‌గా సాగడంతో ఆ పార్టి శ్రేణుల్లో నూతన ఉత్తేజం ఉట్టిపడింది.అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాల్‌రాజు పనితీరును ఎండ గ ట్టారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.అచ్చంపేట నల్లమల అప్పర్ ప్లాట్ నుండి కేసిఆర్ పతనం ప్రారంభ మైం దని ప్రభుత్వం తీరును ఎండగట్టారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవెర్చాలని సభ వేదిక నుండి సవాల్ విసిరారు.సిఎం కేసిఆర్ మాటలు పిట్టల దొరను తలపిస్తున్నాయని ఏద్దేవా చేశారు. అంత కంటే ముందు మన్ననూర్ చౌరస్తాలో ప్రజల కు అభివాదం చేసి అమ్రాబాద్ అంబేద్కర్ చౌరస్తావ రకు భారీ కాన్వాయిలో సభ స్థలికి చేరుకున్న ఆ యనకు ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు నాయ కులు ఘన స్వాగతం పలికారు. ప్రజా కళాకారుడు వేమూరి సొమన్న ఆలపించిన పాటలు ప్రజలను ఆలోచింప జేశాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్ర జా వ్యతిరేక విధానాలను పాటలు మాటల ద్వార ఆలపించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కేటిఆర్ కన్ను సన్నలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే నల్లమల అడవిలోని యురేనియం వెలికితీతకు రంగం సిద్దం చేశారని ఆయన ఆరోపించారు. గతంలో నక్సలైట్లు ఉండడం వల్ల సాద్య పడలేదని ప్రస్తుతం అడవి తల్లి ఒడిలోని చెంచులు మాత్రమే అడ్డంకిగా భావించిన ప్రభుత్వం వారిని తరలించేందుకు కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి తుక్కుగూ డ ప్రాంతంలో పంపించేందుకు అటవి అధికారుల కు ఆదేశాలు జారి చేసిందని అన్నారు. ప్రక్కనున్న నల్గొండ జిల్లా ప్రజలు ప్లొరైడ్ బారిన పడి వికలాం గులైన చిన్నారులను ఇళ్ళలోని మంచాలకు కట్టేసి తల్లిదండ్రులు కూలీనాలి చేసి బ్రతుకు లీడుస్తున్నా రని ఆయన విచారం వ్యక్తం చేశారు.నల్లమల అటవి ప్రాంతం లో చేపట్టే యురేనియం తవ్వకాలను ప్రజ లు ప్రజా సంఘాల మద్దతుతో అడ్డుకుం టామని ఆయన స్పష్టం చేశారు.