Home రాష్ట్ర వార్తలు దుబాయ్ రాజుతో ఉన్న లావాదేవీలు బయటపెడతా : రేవంత్‌రెడ్డి

దుబాయ్ రాజుతో ఉన్న లావాదేవీలు బయటపెడతా : రేవంత్‌రెడ్డి

revanthreddyమన తెలంగాణ/ హైదరాబాద్: కెసిఆర్ కుటుంబం దుబాయ్ రాజుతో చేసుకున్న లావాదేవీలను బయటపెడతానని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ మాటకు కట్టుబడి ఎంఆర్ ప్రాపర్టీస్‌లో ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూమిలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేనిపక్షంలో దుబాయ్ రాజు, కెసిఆర్ కుటుంబ సభ్యుల మధ్య లావాదేవీలు బయటపెట్టక తప్పదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు తమకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు పేర్కొనడం సిగ్గు చేటన్నారు. నాడు వైఎస్ ప్రోత్సహించిన ఫిరాయింపులు తప్పు కాదని హరీశ్ అంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు 70 స్థానాలు వచ్చే పరిస్థితే ఉంటే టిడిపి నాయకుల వెంట ఎందుకు పడుతున్నారని రేవంత్ కెటిఆర్‌ను ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు, జానారెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిన విషయం కెటిఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కెసిఆర్ తన పాపాలు కడుక్కునేందుకు యాగాలు చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.