Search
Sunday 18 November 2018
  • :
  • :

ట్రంప్ టారిఫ్‌లపై ప్రతీకారం

 bsna

29 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంపు

 ఒక్క మోటార్ సైకిళ్లపై సుంకం మినహాయింపు
 కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రతీకార చర్యలో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై భారత్ సుంకాన్ని పెంచింది. వీటిలో బెంగాల్ గ్రామ్, కాయ ధాన్యాలు, ఆర్జిమియా వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ దిగుమతి సుంకం పెంపు ఆగస్టు 4 నుంచి అమల్లోకి రానున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. చిక్‌పీస్, బెంగాల్ గ్రాముపై దిగుమతి సుంకాన్ని 60 శాతానికి పెంచగా, కాయధాన్యాలపై 30 శాతానికి పెంచింది. బోరిక్ యాసిడ్, ఫౌండ్రీ మౌల్డ్ కోసం బెండర్స్‌పై సుంకాన్ని 7.5 శాతానికి కేంద్రం పెంచింది. అలాగే దేశీయ పదార్థాలపై 10 శాతం పెంచినట్టు అధికారులు వెల్లడించారు. అర్టిమియా అనే రకం రొయ్యలపైనా కస్టమ్ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఇంకా గింజలు, ఐరన్, స్టీలు ఉత్పత్తులు, యాపిల్స్, పియ ర్స్, స్టెయిన్‌లెస్ స్టీలు ఉత్పత్తులు, ఇతర అలోయ్ స్టీల్, పైప్ ఫిట్టింగ్స్, మరలు, బోల్డ్‌లు, రివైట్స్‌పైనా దిగుమతి సుంకాన్ని పెంచినట్టు అధికారులు తెలిపారు. అయితే అమెరికా నుంచి దిగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై సుం కాన్ని పెంచలేదు. ఈ సవరించిన ఉత్పత్తుల జాబితాను గత వారం డబ్లుటిఒకు భారత్ అందజేసింది. దీనిలో 50 శాతం వరకు సుంకాలను పెంచుతున్నామని ప్రతిపాదించింది. ఇటీవల అమెరికా స్టీలు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచినందుకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా విధించే సుం కం 241 మిలియన్ డాలర్లు ఉంటుంది. భారత్ కూడా అమెరికా విధించిన సుంకాలకు సరిసమానంగా తాజాగా దిగుమతి సుంకాలను విధించింది. 30 ఉత్పత్తులను భార త్ సుంకం పెంపు జాబితాలో పేర్కొనగా.. వీటిలో నుంచి 800 సిసి మోటార్‌బైక్‌లను మినహాయించింది. దీంతో మొత్తంగా 29 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచినట్టవుతుంది. మార్చి 9న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియంపై భారీగా సుంకాలను పెంచడంతో అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికా కస్టమ్ డ్యూటీ పెంచడం వల్ల భారత్‌లో స్టీలు ఎగుమతులపై 198 మిలియన్ డాల ర్లు, అల్యూమినియంపై 42 మిలియన్ డాలర్లు ప్రభావం పడనుంది. డబ్లుటిఒ(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో అమెరికా విధించిన సుంకాలపై భారత్ గట్టిగా ప్రశ్నించింది. ప్రతి ఏడాది అమెరికాకు భారత్ నుంచి 1.5 బిలియన్ల డాలర్ల స్టీలు, అల్యూమినియం ఎగుమతి అవుతుంది. 2016-  2017లో అమెరికాకు భారత్ ఎగుమతులు మొత్తంగా 42.21 బిలియన్ డాలర్లుగా..  దిగుమతులు 22.3  బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

Comments

comments