Home పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

speak*చార్జి మెమోలు వెనక్కి తీసుకోవాలని వినతి
*దొంగలకు సద్దికట్టమని ఉద్యోగ సంఘాలుఅడగడం సరికాదు
*తిరస్కరించిన పెద్దపల్లి ఇన్‌ఛార్జి కలెక్టర్
*ఉద్యోగ సంఘాలతో అసంతృప్తిగా ముగిసిన చర్చలు
*భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు

మనతెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలో భూదస్త్రాల శుద్దీకరణలో నిర్ల క్షం వహించిన 12మంది మండల రెవెన్యూ అధికారులకు చార్జి మెమోలు జారీ చేయడంపై జిల్లాలోని 14 మండలాల తహసీల్దార్లు,రెవెన్యూ సిబ్బంది ఒకరోజు పెన్‌డౌన్ సమ్మె చేసి టిఎన్జీవో ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్ కార్యాల యం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది.పెద్దపల్లి జి ల్లాలో ఉన్న 14మండలాలకు గాను ఒదెల,కాల్వశ్రీరాంపూర్ మండలాల తహసీల్దార్‌లకు మినహా మిగతా 12మందికి చార్జి మెమోలు జారిచేయడం ఎంతవరకు కరెక్టని ఉద్యోగ సంఘాలు కలెక్టర్‌ను నిలదీశాయి.విధి నిర్వహణ లో అలక్షం పనికి రాదని గతంలో పలుమార్లు జరిగిన సమీక్షా సమావేశం లో హెచ్చరించానని కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించి న గ డవులోగా భూ రికార్డుల శుద్ధీకరణ జరగడంలేదని అన్నారు. జిల్లాలోని 215 రెవిన్యూ గ్రామాలకు గాను కేవలం 161 గ్రామాలలో భూ దస్త్రాల ప్రక్షా లన పూర్తయిందని,అందులో 131గ్రామాలలో చెక్ లిస్ట్ పూర్తికాగా,102 గ్రామాల్లో డ్రాపవుట్ మాత్రమే పూర్తయిందని అన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన పనులలో లక్షాన్ని చేరుకోక పోవడంతో పాటు,మండల రెవెన్యూ అధి కారులు ప్రజల పట్ల నిర్లక్షం వహిస్తున్నారనిఅన్నారు. గతంలో పలుమార్లు హెచ్చ రించినా మార్పు రాలేదని గత్యంతరం లేకే నిబంధనల ప్రకారం చర్య లు తీసుకున్నానని కలెక్టర్ వారికి తెల్చి చెప్పారు. ఉద్యోగులకు తాము జారీ చేసిన చార్జి మెమోలో పేర్కొన్న ఆరోపణలపై వివరణ ఇస్తే పరిశీలిస్తానని కలె క్టర్ పేర్కొన్నాడు.అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు తహసీల్దార్‌లు ప్ర త్యే కంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపినట్లు ఉద్యోగ సం ఘాలు తెలిపాయి.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రాజయ్య,ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మారం జగదీశ్వర్,పెద్దపల్లి జిల్లా కన్వీ నర్ బొంకూరి శంకర్,కో కన్వీనర్ రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.