Home తాజా వార్తలు ప్రభుత్వ భూముల జియో ట్యాగింగ్ అంతేనా?

ప్రభుత్వ భూముల జియో ట్యాగింగ్ అంతేనా?

Revenue Officers Raised Hands Initially

ఆరంభంలోనే చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు                                                                                                    అన్యాక్రాంతం అవుతున్న కోట్ల విలువైన భూములు 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ నగరంలో గజం స్థలం కొనాలంటే రూ.50 వేల నుంచి లక్షా రూపాయలు పెట్టాల్సిందే. అలాంటి ఈ నగరంలో ప్రభుత్వం భూములు పరిరక్షణ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారుల మాటలకు చేతలకు పొంతన లేకుండా పో తోంది. అర్భన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్షంగా గత ఏడాది జూలై చివరి వారంలో జియో ట్యాగింగ్‌కు శ్రీకారం చుట్టినా జిల్లా రెవెన్యూ అధికారులే దానిని అర్థంతరంగా పక్కన పెట్టేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, యుఎల్‌సి భూముల లెక్క తేల్చడమే లక్షంగా గత ఏడాది క్రితం జియో ట్యాగింగ్‌ను చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫైలెట్ ప్రాజెక్టు కింద అం బర్ పేట్ మండలంలోని 158, 159 వార్డులను ఎంపిక చేయడమే కాకుండా ఇందుకు సంబంధించిన పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం, వారు రెవెన్యూ సిబ్బందికి 10 రోజుల శిక్షణ సైతం ఇచ్చారు. ఇందుకు సంబంధించి అప్పట్లో రూ.25 లక్షల వరకు అధికారులు ఖర్చు చేసిన అధికారులు అర్థాంతరంగా జియో ట్యాగింగ్‌ను పక్కన పెట్టడంతో ప్రజాధనం వృథాగా మారడమే కా కుండా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వం భూ ములు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయి. ఆ తర్వాత మేల్కొంటున్న అధికారులు వాటిని తొలగించేందుకు యత్నించడం, భూ కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించడంతో న్యాయ వివాదాల్లో చిక్కుకుంటుడడంతో అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

జియో ట్యాగింగ్ ద్వారా కబ్జాలను అరికట్టడం సులువు
ప్రభుత్వం భూములకు జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా వాటిని కబ్జాకు గురికాకుండా కాపాడడం ద్వారా అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉండందూ.. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేయడం వల్ల ప్రత్యేక నంబర్ కేటాయించడం, ఆయా స్థలాల విస్తీర్ణం, చుట్టుపక్కల హద్దులను ఖచ్చితంగా గుర్తించి వాటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చడమే కాకుండా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్స్‌కు పంపించడం ద్వారా అవి అక్రమార్కుల పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా కాపాడే అవకాశం ఉంది. పాత నేరస్తులను గుర్తించేందుకు పోలీసు శాఖ సైతం ఇదే విధానాన్ని అవలభిస్తోంది. అంతేకాకుండా మర మగ్గాల లెక్క తెల్చేయడం వాటిని ఖచ్చితంగా గుర్తించేందుకు చేనేత శాఖ కూడా జియో ట్యాగింగ్‌ను చేసింది. ఇంతంటి ఉపయోగాలున్నా జియో ట్యాగింగ్ విధానాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టినట్లే చేపట్టిన ఆరంభంలోనే అటకేక్కించడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇబ్బంది పడుతున్న 58, 59 జిఓల లబ్ధ్దిదారులు
ప్రభుత్వ భూములకు సంబంధించి జియో ట్యాగింగ్‌ను రెవెన్యూ అధికారులు పక్కన పెట్టడంతో 58, 59 జిఓ లబ్ధ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఉచితంగా క్రమబద్ధ్దీకరించేందుకు జిఓ 58, నామ మాత్రపు రుసుంతో అర్హులైన వారికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు జిఓ 59ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 58,59 జిఓ కింద క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ అయిన భూములన్ని ప్రభుత్వ భూములు కావడంతో ఇప్పటీకి అవి ప్రభుత్వ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. అదే జియో ట్యాగింగ్ విధానం అమలై ఉంటే ప్రభుత్వ భూముల స్థానంలో 58, 59కు సంబంధించిన లబ్ధ్దిదారుల వివరాలు నమోదు అయ్యేవి. కాని అధికారులు రెవెన్యూ అధికారులు జియో ట్యాగింగ్‌ను పక్కన పెట్టడంతో 59 జిఓ కింద రిజిస్ట్రేషన్ అయిన స్థలాలు తమ అవసర నిమిత్తం అమ్ముకుంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం అవి ఇంకా ప్రభుత్వ భూములగానే నమోదు అయి ఉండడంతో వాటి రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తుండడంతో లబిద్దారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.