Search
Saturday 17 November 2018
  • :
  • :

కరీంనగర్ స్మార్ట్ పనులపై సమీక్ష

hall

*హైదరాబాద్‌లో స్మార్ట్ సిటీ సమావేశం
*పాల్గొన్న ఎంపి, ఎంఎల్‌ఎ,మేయర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్:కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భా గంగా హైదరాబాద్‌లోని సిడిఎంఎ కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ, నేషనల్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ స్మార్ట్ సిటీ డాక్డర్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటి బోర్టు 3వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్, ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ శశాంకలు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్దిలో భాగంగా చర్చించారు. కరీంనగర్ మానేర్ రివర్ ఫ్రంట్ పనులలో భాగంగా కన్సెల్టెన్సీతో చర్చించారు.
నగరంలోని జరుగుతున్న స్మార్ట్ రోడు పనులు, రూప్ టాప్స్, పార్కుల సుందరీకరణ, తదితర స్మార్ట్ సిటీ పనులపై సమీక్షించారు. రోడ్లకు పా ర్కులకు సోలార్ రూప్ టాప్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్చించా రు.నగరాన్ని అన్ని రంగాలలో అభివృధ్ధి చేసి స్మార్ట్ లుక్‌లు తీసుకురావడమే లక్షంగా ముందుకు సాగేందుకు ప్రణాళికలు రూపొందించేందు కు చర్యలు చేపట్టారు.
నగరంలో కొనసాగుతున్న స్మార్ సిటీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ టి.కె. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments