Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సెక్షన్ 377 రాజ్యాంగబద్ధతపై పునఃపరిశీలన

అంగీకరించిన సుప్రీం

Transgender

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగ ణించే  సెక్షన్ 377 రాజ్యాంగబద్ధతను పునః పరిశీలించేందుకు సుప్రీం కో ర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స హా మరో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మా సనం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. మరింత మంది సభ్యులతో కూడిన ధర్మాసనంలో సెక్షన్ 377 రాజ్యాంగబద్ధతపై చర్చించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2013 లో ఢిల్లీ కోర్టు ఓ కేసులో స్వలింగ సంపర్కం నేరం కాదని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొ ట్టివే సింది. అప్పట్లో ఎల్‌జిబిటిక్యు  (లెస్బీయ న్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెం డర్, క్వీర్) సెక్స్‌ను నేరంగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు తీసుకు న్న నిర్ణ యం మానవహక్కుల ఉల్లంఘన అని వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ తరుణం లో ఇప్పుడు ఆ తీర్పును కోర్టు తిరిగి పరిశీలిం చనుంది. కా గా, ప్రకృతికి విరుద్ధమైన లైంగిక చర్యలను నే రంగా పరిగణిస్తూ ఉన్న చట్టం బ్రిటిష్ కాలం నాటిదని, ఒకరికి ప్రకృతి సహజం అని పించిన విషయం మరొకరికి ఆ విధంగా అనిపిం చకపో వచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఈ చట్టం వల్ల తాము భయం భ యం గా బతకాల్సి వస్తోందని  ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్ పై సో మవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Comments

comments