Home నల్లగొండ యాసంగిలో తగ్గిన వరి సాగు

యాసంగిలో తగ్గిన వరి సాగు

నోట్ల రద్దుతో పుట్టని అప్పులు
పెట్టుబడులు లేక అన్నదాతల ఇబ్బందులు

Rice-Cultivation

నల్లగొండ : జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు అనుకున్న దానికంటే అధికంగ కురిసినప్పటికి యాసంగి వరి సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయాధికారులే దృవీకరిస్తున్నారు. విస్తరంగా వర్షాలు కురిసిన నేపధ్యంలో జిల్లాలో చెరువులు కుంటలు 70శాతం అందుబా టులు జలసిరులు నిండివున్నాయి. అయితే రైతులుకున్న సాగు భూమి నంత సేధ్యం చేసేందుకు నీరున్న అవసరమైన పెట్టుబడులు అందక పోవ డంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ సబ్సీడీ విత్తనాలు, ఎరువులు సకాలంలో అనుకున్నంత మొత్తంలో రైతులకు అందుబాటులో వుంచలేకపోయారు.

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటుడగా రైతన్నల వద్ద చిల్లిగవ్వ లేకుండా పోవడం తో రబీ పంటను అనుకున్న మేర విస్తీర్ణంలో సాగు చేయలేకపోయారు. ప్రభుత్వం పంట రుణాలను సకాలంలో అందించలేక పోవడం ప్రైవేటు అప్పులు పుట్టక సాగు మరింత కష్టంగా మారింది. ఖరీఫ్ పంట దిగుబడి చెల్లింపులు రైతుల అకౌంటుల్లో నేరుగా వేయాడంతో డబ్బులు రైతులు బ్యాంకుల నుంచి పొందలేక ఇబ్బందులు పడ్డారు.

నారుమల్లు సకాలంలో సిద్దం చేసుకోలేక, దున్నకాలకు చెల్లింపులు లేక అలస్యంగా తక్కువ సాగు విస్తీర్ణంలో వరి నాట్లు వేస్తున్నారు. నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో మూసి పరివాహాక ప్రాంతంలోని శాలిగౌరారం, కేతేపల్లి, నకిరే కల్, కట్టంగూర్‌లలో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. అదేవిధంగా యాదాద్రిభువనగిరి జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి తదితర ప్రాంతాలలో కొంత మేర వరి నాట్లు వేస్తున్నారు. సాగర్ ఎడమకాల్వ కింద వున్న హాలియా,నిడుమనూర్, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ తదితర మండలాలలో వరి నాట్లు ఇప్పుడే ఉపందుకున్నాయి. అదే విధంగా పలు ప్రాంతాలలో వేరుశనగ, మొక్కజొన్న పంటను వేశారు.

జలసిరులు సమృద్ధిగా వున్నప్పటికి పెట్టుబడులకు డబ్బులు పుట్టక సాగు చేయలేక అన్నదాతలు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా  పంటలు లేక రైతులు అపుల్లో కూరుకుపోయారు. ఈ సంవత్సరం అనుకున్నదాని కంటే అధికంగానే వర్షపాతం నమోదు అయినప్పటికి రైతున్నలకు చేతి డబ్బులు లేక పెట్టుబడులు అందక రభీ సాగు తగ్గిందన్న అభిప్రాయాలు వున్నాయి. ముఖ్యంగా పెద్ద నోట్లు రద్ధు కావడం గ్రామాలలో అప్పులు పుట్టక యాసంగి సాగు కష్టంగా మారింది. కనీసం ట్రాక్టర్ దున్నకానికి, కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగి సాగు ముందుగా వుహించినంత చేయడం లేదు చెపుతున్నారు. చెరువులు, కుంటలలో జలసిరులు అనుకూలంగా వున్న అవసరమైన డబ్బు చేతికి అందక సాగు విస్తీర్ణం తగ్గించి నల్లగొండ మండలం కొత్తపల్లిలో నాట్లు కొనసాగిస్తున్నారు.