Home జగిత్యాల సర్పరాజ్‌పల్లె అంగన్‌వాడీ కేంద్రం బియ్యం పక్కదారి

సర్పరాజ్‌పల్లె అంగన్‌వాడీ కేంద్రం బియ్యం పక్కదారి

సూపర్‌వైజర్ చెబితే పంపానంటున్న అంగన్‌వాడీ టీచర్
నిర్లక్ష ధోరణిలతో సూపర్‌వైజర్లు

నామమాత్రపు పరిశీలనల్లో అధికారులు
డిసెంబర్ నెలలో బాల అమృతం గోవిందా
అంగన్‌వాడీ కేంద్రాల్లో పుచ్చుపడుతున్న బియ్యం

ration rice Fraud

కోరుట్ల రూరల్: అంతా మాఇష్టం మమ్మల్ని అడిగే వారేవరు అనే ధోరణి నడుస్తున్నాయి కోరుట్ల మండలంలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు. ఎవరికివారే యమునా తీరే అనే విధంగా అంగన్‌వాడీ తీరులుంటున్నాయి. సర్పరాజ్‌పల్లె అంగన్‌వాడీ కేంద్రం నుండి రెండుబస్తాల బియ్యం పక్కదారిలో తరలింపులు జరిగిన పట్టించుకునే వారు కరువయ్యారు. పిల్లలకు, గర్భిణులకు భోజనం కోసం ప్రభుత్వం పంపిణి చేసే బియ్యం తరలింపులు ఏంటి అని ప్రశ్నిస్తే సూపర్‌వైజర్ చెబితే పంపానంటు అంగన్‌వాడీ టీచర్ బదులివ్వడం కొసమెరుపు. మండల పరిధిలో రెండు సెక్టార్లలో 42 అంగన్‌వాడీ కేంద్రాలుండగా ప్రతిరోజు అంగన్‌వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తున్నారా, గర్భిణిలకు, పిల్లలకు రావల్సిన సరుకులు సరిగ్గా వస్తున్నాయ అని పరిశీలించాల్సిన సూపర్‌వైజర్లు నాలగు నెలల్లో ఏదో ఒకసారి మాత్రమే అలా వచ్చామా వెళ్ళామా అనే నామమాత్రపు పరిశీలనలతో కాలాయాపన చేస్తున్నారు.

పుచ్చుపట్టిన బియ్యం….

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారడానికి సర్పరాజ్‌పల్లె అంగన్‌వాడి కేంద్రంలో పుచ్చుపట్టిన బియ్యం బస్తాలే నిధర్శనంగా నిలుస్తున్నాయి. అంగన్ వాడి కేంద్రాల్లో సరుకుల విషయంలో పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తు పుచ్చుపట్టిన బియ్యంతో చిన్న పిల్లలకు భోజనం వడ్డిస్తే ఆ భోజనం తిన్న చిన్నారులు ఆసుపత్రిల పాలు కావాల్సిందేనా. కనీసం పిల్లల హాజరు పట్టికలు నమేదు చేశారో లేదో చూడాల్సిన బాధ్యతలు మరిచి తమ ఇష్ఠారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని అంగన్ వాడి కేంద్రాల్లో ఆయలు మాత్రమే కనిపిస్తారు…కొన్ని గ్రామల్లో అంగన్ వాడి సెంటర్లు ఏ విధంగా నడిపిస్తున్నారో చూడల్సిన కనీస బాధ్యతలను మరిచే అధికారులపట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

బాల అమృతం….అంతంత మాత్రమే….

ప్రతి అంగన్ వాడి కేంద్రాలకు రావలసిన బాల అమృతం బ్యాగులు అందరికి రావట్లేదు ఒక్కో సెంటర్‌కు 1. బ్యాగులు, మరికొన్ని సెంటర్లలో2. మరికొన్ని సెంటర్లలో గడచిన డిసెంబర్‌లో అసలు బాలమృతం బ్యాగులు తమకు రాలేదని సమాదానం చేపుతున్నారు. ఎందుకిల అని ప్రశ్నించడంతో మేము చేసేది ఏముంది మాకు పై నుండి రావట్లేదు అనే బదులిస్తున్నారు. బాల అమృతం సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెల్లలేక వారిని అడగలేక అంగన్‌వాడి టీచర్లు జంకుతున్నారు. పై అదికారులను అడగడమా అమ్మో అనే మాటలు వినిపిస్తున్నారు. కొన్ని సెంటర్లలో పిల్లలు ఒకరు,ఇద్దరు మాత్రమే వస్తున్న వారి హాజరు పట్టికలను చూసే భాధ్యతలను మరిచి అలా గాలికి ఒదిలేస్తున్నారు…కొన్ని అంగన్ వాడి సెంటర్లలో కోడిగుడ్లు చాల ఉన్న మరికొన్నిట్లో కోడి గుడ్లు తారస పడడంలేదు..మరికొన్ని సెంటర్లలో సమయపాలన పాటించని అంగన్ వాడిలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.