Home వనపర్తి గడ్డి కష్టాలు

గడ్డి కష్టాలు

Tractor1

మండలంలో వానాకాలం వరి పంట కోతలు , నూర్పిడ్లు పూర్తి కావడంతో రైతులు వరి గడ్డి అమ్మకాలు చేస్తున్నారు. దూర ప్రాంతాల రైతులు వరిగడ్డి కొనుగోలుకు ఎక్కువగా వస్తున్నారు.  రంగసముద్రం రిజర్వాయర్ కింద, జూరాల, మరియు భీమా ఆయకట్టు కింద ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగును చేశారు. దూరప్రాంత రైతులు ట్రాక్టర్లలో ఎక్కువ మొత్తంలో వరి గడ్డిని లోడ్‌చేసి రవాణా చేయడమే కాకుండా దాదాపు 8 నుండి 10 మంది కూలీలు ట్రాక్టర్ ఇంజన్‌పై కూర్చుని ముఖ్యంగా ముందు భాగం బంపర్‌పై కూర్చుని ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. తప్పని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వశాఖలైన రవాణా శాఖా మరియు పోలీస్ శాఖా స్పందించి ఈ ప్రమాద కరమైన ప్రయాణాన్ని నిరోధించాలని ప్రజలు కోరుచున్నారు.

మన తెలంగాణ/శ్రీరంగాపురం