Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పేదోడి బియ్యం పెద్దల పాలు

  • నల్లబజారుకు తరలిపోతున్న 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
  • రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డాగా మారిన మదనాపురం
  • వాహనాలు పట్టుబడినా దళారుల పేర్లు బయటికి రాని వైనం
  • లారీ డ్రైవర్లు, ఓనర్లపై క్రిమినల్ కేసులు మొక్కుబడిగా అధికారుల విచారణ

Rice-Smuggling-Caughtమదనాపురం, కొత్తకోట, వనపర్తి : నిరుపేదలకు కడుపు నింపా ల్సిన రేషన్ బియ్యం సరఫరాలో వ్యాపారులు, దళారులు, అధికారులు కుమ్మకై యథేచ్చగా అక్రమదందాను కొనసాగిస్తున్నారు. సివిల్ సప్లై, రెవెన్యూశాఖలో పనిచేసే కొందరు అధికారుల అండ దండలతో రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్దిల్లుతుంది. జిల్లాలో మొత్తం 325రేషన్ దుకాణాలు ఉండగా ప్రతి నెల 31.817 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ప్రతి నెల ప్రజలకు అందాల్సి ఉండగా స్టేజి 1, స్టేజి2, ఎంఎల్‌ఎస్ పాయింట్, రేషన్ దుకాణాల నుండి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ రూపాయికి కిలో బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో రూ.25 నుండి రూ.28 రూ కిలో బియ్యాన్ని విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు సన్న బియ్యంగా మలచి సరఫరాచేస్తూ కోట్లరూపాయల అక్రమదందాకు పాల్పడుతున్నారు. ఇదే తంతులో భాగంగా శుక్రవారం రాత్రి వనపర్తి జిల్లా పరిధిలోని మదనాపురం మండల కేంద్రంలో ఓ పెట్రోల్ బంక్ ముందు అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఒక లారీ, రెండు డిసిఎంలను ఆర్‌ఐ. గౌస్ అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్టేషన్‌కు తరలించారు. వాటిని పరిశీలించగా అందులో ఉన్నవి రేషన్ బియ్యంగా తేలింది. కొన్ని మిల్లులకు సంబందించిన అడ్రస్ లతో బియ్యం సంచులపై ముద్రించి ఉండడం విశేషం.శనివారం వనపర్తి జిల్లా పౌరసరపరాల అదికారి తనూజ పట్టుబడిన బియ్యం వాహనాల పై విచారణ నిర్వహించారు. రెండు డిసిఎంలు, లారీలో కలిపి మొత్తం 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని పట్టుబడిన బియ్యాన్ని మదనాపురం మండల కేంద్రంలోని స్టేజ్ 1, గోదాంలో నిల్వ చేసి లారీ డ్రైవర్లు, మరియు ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని డిఎస్‌ఓ తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు అనే విషయాన్ని అధికారులు తెల్సుకోలేక పోవడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా మదనాపురం రేషన్ బియ్యం దందాకు అడ్డాగా మారింది. కొందరు రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అధికారులు, మీడియాను మేనేజ్ చేస్తూ బియ్యం వ్యాపారాన్ని యధేచ్చగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మదనాపురం గ్రామం రేషన్ బియ్యం దందాకు కేంద్ర బిందువుగా మారిందని అధికారులకు కూడా తెలిసినప్పటికి దళారులు ఇచ్చే లంచాలకు రుసి మరిగిన అధికారులు రేషన్ బియ్యం వ్యాపారాన్ని యథేచ్చగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శనివారం రేషన్ బియ్యం అక్రమదందాపై విచారణ చేపట్టిన అధికారులు మొక్కుబడిగా తమ విచారణ చేశారని ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడిన రేషన్ బియ్యం దందాలో గద్వాలకు చెందిన వ్యాపారు లు ఉన్నట్లు తెలుస్తుంది.

పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం…
డిఎస్‌ఒ తనూజ..

మదనాపురం మండల కేంద్రంలో పట్టు బడిన రేషన్‌బియ్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని వనపర్తి జిల్లా పౌరసరపరాల అధికారిణి తనూ
జ తెలిపారు. స్టేజి 2,స్టేజి1, ఎంఎల్‌ఎస్ పాయింట్, రేషన్ షాపులపై విచారించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తకోటకు చెంది
న లారీ డ్రైవర్లు, ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

Comments

comments