Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

బోల్డ్ పాత్రలో రిచా

Richa

దక్షిణాది ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే సౌత్ స్టార్ హీరోలు అంతా కూడా తమ సినిమాల విడుదల తేదీని మార్చుకునేవారు. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరోలు ఎంతో మంది షకీలా సినిమాలు చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పట్లో స్టార్‌గా వెలిగిన షకీలా ప్రస్తుతం చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆమె జీవితం సినిమాటిక్‌గా ఎంతో విభిన్నంగా ఉంటుంది. అందుకే షకీలా జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో షకీలా పాత్రను బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా చేయనుంది. అయితే తమ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా షకీలా పాత్రకు రిచా న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ‘లవ్ సోని యా’ అనే చిత్రాన్ని చేస్తోంది. ఇందులో ఆమె వేశ్య పాత్ర లో కనిపించనుం ది. చాలా బోల్డ్ పాత్రను పోషించిన రిచా చద్దా లుక్‌ను తాజా గా విడుదల చేశారు. ఇక షకీలా బయోపిక్‌లో రిచా హద్దులు మీరి అందాలను ఆరబోస్తుందట.

Comments

comments