Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జూరాల నీరు   ఈ ప్రాంత ప్రజల జన్మహక్కు

mbnr* జిఒ 69ను సాధించి తీరుతాం * ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు తగవు
*అఖిలపక్షం నాయకులు

 కోడంగల్ రూరల్: జూరాల నీరు ఈప్రాంత ప్రజల జన్మహక్కని, జిఒ 69 ప్రకారం నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, మాజీ ఎంఎల్‌ఎ దయాక ర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర శుక్రవారం కొడంగల్‌కు చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం జిఒ 69ను విడుదల చేసిందని, గవర్నర్ ద్వారా ప్రాజెక్టు రూపకల్పనకు రూ.1400 కోట్లు మంజూరు కాగా అందులో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా, 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పనులు పక్కన పెట్టి పక్కనే ఉన్న జూరాల నుంచి కాకుండా ఎక్కడో 300 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు…నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. జూరాల కృష్ణా ట్రిబ్యూనల్ ద్వారా 46 టిఎంసిల నికర జలాలపై పాలమూరు జిల్లా రైతులకు హక్కు ఉందని పేర్కొన్నారు. పార్టీలను, పార్టీ జెండాలను పక్కన పెట్టి అన్ని పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి ప్రాజెక్టు కోసం ఉద్యమిస్తుంటే అధికార పక్షం నాయకులు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బం గారు తెలంగాణ అంటూ సిఎం కె సిఆర్ ఈ ప్రాంత రైతుల నడ్డి విరు స్తున్నారని ఆరోపించారు. ప్రాజె క్టులకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణకు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 69 జిఒ ప్రకారం నారాయణపేట-కొడంగల్ పథకాన్ని ప్రారంభించాలని, లేని పక్షంలో ఆగస్టు 1న పాల మూరులో నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జల సాధన జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, మండల కన్వీనర్ దామోదర్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు విష్ణు, సుభాష్, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments