Home జాతీయ వార్తలు పనిమనుషులకు వేతనం

పనిమనుషులకు వేతనం

 ఏటా 15 రోజులు ఆర్జిత సెలవు

జాతీయ విధానంపై కసరత్తు

House worker_manatelanganaన్యూఢిల్లీ: రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉండే పని మను షులు కావాలనుకుంటే ఇక నుంచి వారికి కనీస వేతనంగా 9 వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఏడాదికి 15 రోజుల వేత నంతో కూడిన లీవు (పెయిడ్  లీప్) ఇవ్వడం తప్పనిసరి. పని మనుషుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్‌డిఎ ప్రభు త్వం తీసుకురాబోతున్న జాతీయ విధానంలో ఈ నిబంధనల ను పొందుపరచనున్నారు. లైంగిక వేధింపులు, వెట్టి చాకిరికి చరమగీతం పాడుతూ వారికి సామాజిక భద్రత కల్పించే విధం గా కూడా ఇందులో ప్రధానం కాబోతోంది. కేంద్రం ఈ మేరకు డొమెస్టిక్  వర్కర్  నేషనల్  పాలసీను కేబినెట్  ముందుకు తీసు కురానుంది. ఓపిక ఉన్నంతవరకూ పని చేయించుకుని వయసు ఉడిగిన తర్వాత వాళ్లను తొలగించడం సహజంగా జరుగుతుం టుంది. అయితే వారికి కొత్త విధానంలో సామాజిక భద్రత కల్పించడం జరుగుతుంది. ఇలాంటి వారికి యజమానుల తరఫున కొంత కంట్రిబ్యూషన్  (చెల్లింపు) తప్పనిసరి చేయను న్నారు. చదువు, సురక్షిత పనివాతావరణం, వారి సమస్యల పరిష్కరానికి తగిన యంత్రాంగం ఏర్పాటు వంటివి కూడా ఈ పాలసీలో పొందుపరచనున్నారు. ఇదే విధంగా పనివాళ్లు, యజమానులు గ్రూపులు ఏర్పాటు చేసుకుని, పరస్పర బేరసా రాలు జరుపుకునే వీలు కూడా కల్పిస్తారు. ఈ విధివిధానాలకు సంబంధించి ముసాయిదా నోట్‌ను కార్మిక సంక్షేమ డైరెక్టర్  జనరల్  (డిజిఎల్‌డబ్లు) గతవారంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు సమర్పించారు. ‘డొమెస్టిక్ వర్కర్స్  పాలసీని రూపొందిస్తున్నాం. ఇంటి పనులు చేసేవారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అలాంటి వారికి సంక్షేమం, భద్రత కల్పించడం చాలా ముఖ్యం’ అని మంత్రి దత్తాత్రేయ పిటిఐకి తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలకు అనుగు ణంగా విధాన రూపకల్పన జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విధానం అమల్లోకి రాగానే, యజమాని, పనివారు, వీరికి మధ్యవర్తిత్వం నెరపే ఏజెన్సీ కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసు కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఒప్పందానికి చట్టబద్ధత లభి స్తుంది. కనీస నెలసరి వేతనం అనేది నాలుగు కేటగిరీలుగా ఉండాలని ముసాయిదా పాలసీ సిఫార్సు చేస్తోంది. ఆ ప్రకారం పనివార్లను నిపుణత లేని (అన్ స్కిల్డ్),   ఓమోస్తరు నైపుణ్యం ఉన్న (సెమీ స్కిల్డ్), నిపుణులైన (స్కిల్డ్), అత్యంత నైపుణ్యం కలవారు (ఫుల్  స్కిల్డ్)గా విభజిస్తారు. అత్యంత నిపుణత కలిగి, పూర్తి స్థాయి సేవలందించే వారికి కనీసం వేతనం రూ.9 వేలుగా ఉండబోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.