Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మీకూ షుజాతకు పట్టిన గతే

 Kashmir Editor Shujaat Bukhari Shot Dead By Militants

జమ్మూ: వారు తమ తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో మిలిటెంట్ల కాల్పుల్లో హతమైన ‘ రైజింగ్ కశ్మీర్’ పత్రిక ఎడిటర్ షుజాత్‌కు పట్టిన గతేవారికీ పడుతుందని హెచ్చరించారు. అయితే లాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర పోలీసులు ఈ వ్యాఖ్యలకు గాను ఆయనపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.‘ కాశ్మీరీ జర్నలిస్టులు ఒక తప్పుడు వాతావరణాన్ని  సృష్టించారు. మీకై మీరు ఒక లక్ష్మణ రేఖను గీసుకోండని నేను వారిని కోరుతున్నాను. బషారత్ (షుజాత్ బుఖారీ)లాగా కావాలని మీరు అనుకుంటున్నారా? మీ ప్రాణాల గురించి ఆలోచించండి. సౌభ్రాతృత్వం దెబ్బతినకుండా ఉండడానికిగాను మీకై మీరు లక్ష్మణ రేఖను గీసుకోండి. రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలంటే ఆ సౌభ్రాతృత్వాన్ని కాపాడడం అవసరం’ అని లాల్‌సింగ్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. గత ఏప్రిల్‌లో పిడిపిబిజెపి సంకీర్ణ ప్రభుత్వంనుంచి రాజీనామా చేసిన తర్వాత లాల్‌సింగ్ కథువా హత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తు కోసం ఉద్యమం చేపట్టిన  విషయం తెలిసిందే.

గత జనవరిలో జరిగిన ఈ సంఘటనపై మీడియా ముఖ్యంగా కాశ్మీరీ జర్నలిస్టులు ఒక తప్పుడు వాతావరణాన్ని సృష్టించారని సమయం దొరికినప్పుడల్లా ఆరోపిస్తూనే ఉన్నారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులకు మద్దతుగా జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్నారన్న ఆరోపణలపై సింగ్‌తో పాటు మరో బిజెపి ఎమ్మెల్యే చందర్ ప్రకాశ్ గంగాలు గత ఏప్రిల్ 13న తమ పదవులకు రాజీనామా చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారికి మొత్తం జమ్మూ ప్రాంతం మద్దతుగా నిలుస్తోందన్న తప్పుడు అభిప్రాయాన్ని  మీడియా సృష్టించిన కారణంగానే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందని సింగ్ ఇంతకు ముందు  వాదించారు. కాగా సింగ్ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు దారణమైనవని, రాష్ట్ర పోలీసులు ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి ఒక ట్వీట్‌లో అన్నారు.  పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సైతం లాల్ సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ, మిగతా జర్నలిస్టులను బెదిరించడానికి షుజాత్ హత్య ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారనిపిస్తోందన్నారు. మరో వైపు లాల్‌సింగ్‌పై చర్య తీసుకోవాలని గవర్నర్ వోహ్రాను కోరాలని కశ్మీర్ జర్నలిస్టులు నిర్ణయించారు. ఎడిటర్స్ గిల్డ్ సైతం లాల్‌సింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టింది.

Comments

comments