Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఫైనల్లో పుణె

puneముంబయి: రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఐపిఎల్ పదో సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి క్వాలిఫయ ర్‌లో పుణె 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటిం గ్ చేసిన పుణె 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇందులో ఓడినా ముంబయికి మరో చాన్స్ ఉంది. 19న జరిగే రెండో క్వాలి ఫయర్‌లో ఎలిమినేటర్ విజేతతో ముంబ యి తలపడుతుంది. ముంబయి జట్టులో పార్థివ్ పటేల్ (52) తప్ప మిగతావారు విఫలమ య్యారు. పుణె బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఆదుకున్న రహానె, మనోజ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పుణెకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే కెప్టెన్ స్మిత్ (1) కూడా వెనుదిరిగాడు. దీంతో పుణె 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను సీనియర్ రహానె తనపై వేసుకున్నాడు. అతనికి మనోజ్ తివారి అండగా నిలిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అంతేగాక, కీలక ఇన్నింగ్స్‌తో జట్టును సురక్షిత స్థితికి చేర్చారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలిచారు. అయితే ముంబయి బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ పుణెను భారీ స్కోరు చేయకుండానే అడ్డుకున్నారు. అయితే రహానె నెమ్మదిగా బ్యాట్‌ను ఝులిపించడం మొదలు పెట్టాడు. అడపాదడపా బౌండరీలు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో 43 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేగాక, మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. మరోవైపు మనోజ్ తివారి కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేసి చివరి బంతికి రనౌటయ్యాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ భారీ షాట్లతో చెలరేగాడు. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోనీ తర్వాత తన మార్క్ షాట్లతో చెలరేగాడు. ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ధోనీ 26 బంతుల్లో ఐదు భారీ సిక్సర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పుణె స్కోరు 162కి చేరింది.
స్కోరుబోర్డు: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: అజింక్య రహానె ఎల్బీ-బి కర్ణ్ శర్మ 56, రాహుల్ త్రిపాఠి (బి) మెక్లనగాన్ ౦, స్టివ్ స్మిత్ (సి) హార్ధిక్ పాండ్యా (బి) మలింగ 1, మనోజ్ తివారి రనౌట్ (బుమ్రా) 58, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 40, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 20 ఓవర్లలో 162/4.బౌలింగ్: మెక్లనగాన్ 4-0-46-1, మలింగ 3-0-14-1, బుమ్రా 4-0-33-0, కర్ణ్ శర్మ 4-0-30-1, కృనాల్ పాండ్యా 4-0-22-0, హార్దిక్ పాండ్యా 1-0-15-0.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: లెండిల్ సిమన్స్ రనౌట్(ఠాకూర్) 5, పార్థివ్ పటేల్ (సి) క్రిస్టియన్ (బి) ఠాకూర్ 52, రోహిత్ శర్మ ఎల్బీ-బి వాషింగ్టన్ సుందర్ 1, రాయుడు (సి) స్మిత్ (బి) సుందర్ ౦, పొలార్డ్ (సి) స్మిత్ (బి) సుందర్ 7, హార్దిక్ పాండ్యా (సి) క్రిస్టియన్ (బి) ఫెర్గుసన్ 14, కృనాల్ పాండ్యా (సి) క్రిస్టియన్ (బి) ఠాకూర్ 15, మెక్లనగాన్ (సి) ఉనద్కట్ (బి) ఠాకూర్ 12, కర్ణ్ శర్మ (సి) ధోనీ (బి) ఉనద్కట్ 4, బుమ్రా నాటౌట్ 16, మలింగ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం 20 ఓవర్లలో 142/9.బౌలింగ్: ఉనద్కట్ 4-0-24-1, వాషింగ్టన్ సుందర్ 4-0-16-3, ఫెర్గుసన్ 3-0-21-1, శార్దూల్ ఠాకూర్ 4-0-37-3, ఆడమ్ జంపా 1-0-9-0, క్రిస్టియన్ 4-0-33-0.

Comments

comments