Search
Thursday 15 November 2018
  • :
  • :

పుణె ‘రైజింగ్’

  • ఉనద్కట్ మ్యాజిక్, స్టోక్స్ ఆల్‌రౌండ్ షో
  • సన్‌రైజర్స్‌కు సూపర్‌జెయింట్ షాక్
  • ధోనీ మెరుపులు, యువీ శ్రమ వృధా

RSPG

హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం ఇక్కడి ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ 12 పరు గుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. జైదేవ్ ఉనద్కట్ హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు తీసి పుణెను గెలిపించాడు. బెన్ స్టోక్స్ మరోసారి ఆల్ రౌండ్ షోతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ ఓటమి తో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారగా, పుణె ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. అంతేగాక 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెం డు స్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత కష్టసాధ్యం కానీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 136 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యం హైదరాబాద్‌ను ఓటమి పాలు చేసింది. దెబ్బ తీసింది.
ప్రారంభంలోనే ‘స్టోక్స్’
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ ప్రారంభంలో కుదు రుగానే ఆడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. అయితే 12 బంతుల్లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసిన ధావన్‌ను స్టోక్స్ వెనక్కి పంపి హైద రాబాద్‌ను దెబ్బ తీశాడు. ఆ వెంటనే విలియమ్‌సన్స్ (4)ను కూడా స్టోక్స్ ఔట్ చేశాడు. దీంతో హైదరాబాద్ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పో యింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ వార్నర్, సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు సమ న్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. దీంతో హైదరాబాద్ కోలుకు న్నట్టే కనిపించింది. కానీ 34 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌తో 40 పరగులు చేసిన వార్నర్‌ను ఔట్ చేయడం ద్వారా స్టోక్స్ మరోసారి హైదరాబాద్‌ను దెబ్బతీశాడు. తర్వాత ఉనద్కట్ చెలరేగడంతో సన్‌రైజర్స్ మళ్లీ కోలుకోలేక పోయింది. యువరాజ్ సింగ్ ౩ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఉనద్కట్ హ్యాట్రిక్..
తొలుత యువరాజ్ సింగ్, నామన్ ఓజాలను పెవిలియన్ పంపి పుణెకు పైచేయి అందించిన జైదేవ్ ఉనద్కట్ తర్వాత అద్భుత హ్యాట్రిక్‌ను నమోదు చేసి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతికి బిపుల్ శర్మ(8)ను ఔట్ చేసిన ఉనద్కట్ తర్వాతి రెండు బంతులకు వరుసగా రాషెద్ ఖాన్(౩), భువనేశ్వర్ (౦)లను వెనక్కి పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఉనద్కట్ ౩౦ పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.

ధోనీ మెరుపులు…

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పుణె కూడా ధాటిగా ఆడలేక పో యింది. హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్య ర్థి జట్టును కట్టడి చేశారు. మరోవైపు పుణె జట్టులో స్టోక్స్ ౩సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో ధోనీ ధాటిగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ 21 బంతుల్లోనే రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో ౩1 పరుగులు చేశాడు. మిగతావారిలో స్మిత్ (34), రహానె (24) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

స్కోరుబోర్డు:
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ ఇన్నింగ్స్: రహానె (సి) యువరాజ్ (బి) బిపుల్ శర్మ 22, రాహుల్ త్రిపాఠి రనౌట్ 1, స్మిత్ (సి) బిపుల్ (బి) కౌల్ 34, స్టోక్స్ (బి) రాషెద్ 39, ధోనీ (సి) ఓజా (బి) కౌల్ 31, క్రిస్టియన్ (సి) రాషెద్ (బి) కౌల్ 4, మనోజ్ తివారి రనౌట్ 9, సుందర్ నాటౌట్ 1, ఠాకూర్ (సి) వార్నర్ (బి) కౌల్ 0, ఉనద్కట్ నాటౌట్ ౦, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-39-0, నెహ్రా 1.1-0-5-0, సిద్ధార్థ్ కౌల్ 4-0-29-4, రాషెద్ ఖాన్ 4-0-18-1, హెన్రిక్స్ 2.5-0-15-0, బిపుల్ శర్మ 4-0-39-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఠాకూర్ (బి) స్టోక్స్ 40, ధావ న్ (బి) స్టోక్స్ 19, విలియమ్‌సన్ (సి) ధోనీ (బి) స్టోక్స్ 4, యువరాజ్ (సి) త్రి పాఠి (బి) ఉనద్కట్ 47, హెన్రిక్స్ (బి) తాహిర్ 4, ఓజా (సి) స్టోక్స్ (బి) ఉన ద్కట్ 9, బిపుల్ శర్మ (సి) స్టోక్స్ (బి) ఉనద్కట్ 8, రాషెద్ ఖాన్ (సి) అండ్ (బి) ఉనద్కట్ ౩, భువనేశ్వర్ కుమార్ (సి) తివారి (బి) ఉనద్కట్ ౦, కౌల్ నాటౌట్ ౦, నెహ్రా నాటౌట్ ౦, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం 2౦ ఓవర్లలో 9వికెట్లకు 136 పరుగులు.
బౌలింగ్: ఉనద్కట్ 4-1-30-5, వాషింగ్టన్ సుందర్ 3-0-29-0, స్టోక్స్ 4-0-30-3, ఇమ్రాన్ తాహిర్ 4-0-24-1, ఠాకూర్ 2-0-12-0, క్రిస్టియన్ 3-0-21-0.

 

Comments

comments