Home ఛాంపియన్స్ ట్రోఫీ లయన్స్‌కు స్ట్రోక్స్

లయన్స్‌కు స్ట్రోక్స్

Ben-Stokes

పుణె: 162 పరుగుల లక్ష ఛేదనలో పుణె ఆటగాడు బెన్ స్టో క్స్ (63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్) 103 సెంచరీతో విజృం భించిన వేళ.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. ఆది నుంచి నిల కడగా ఆడుతూ ఒక్కడే చివరి వరకూ ఒంటరిపోరాటం చేసి పుణెను అజేయంగా విజయ తీరాలకు చేర్చడంతో 19.5  ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యా చ్‌లో విజయం తో పుణెకు 2 పాయింట్లు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్టోక్స్‌కు దక్కింది. తొలి ఓవర్‌లోనే తడబ డటంతో పుణె రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా దిగిన రహానె (4) ఎల్‌బిడబ్లుగా వెనుదిరగగా, అతని స్థానంలో వ చ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (4), రాహుల్ త్రిపాఠి (6) పరుగులకే చేతు లేత్తేశారు.

ధోనీ (26) పరుగులకే వెనుదిరగగా, క్రిస్టయిన్ (17) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌కే పరిమిత మయ్యారు. అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ ఓపెనర్లు మెక్‌కలమ్ (45), ఇశాన్ కిషాన్ (31) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించారు. మెక్‌కలమ్ ఆకట్టుకుని హాఫ్ సెంచరీకి చేరువలో చేతులేత్తేశాడు. కెప్టెన్ రైనా బ్యాటిం గ్ (8) పరుగులకే రనౌట్ కాగా, 19.5 ఓవర్లలో గుజరాత్ 161 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పుణె బౌలర్లలో తాహిర్ మూడు వికెట్లు, ఠాకూర్, క్రిస్టయిన్ తలో వికెట్ తీసుకున్నారు.

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: (19.5 ఓవర్లలో) ఆలౌట్, 161.
పుణె సూపర్‌జెయింట్ ఇన్నింగ్స్: (19.5 ఓవర్లలో 5 వికెట్లు) 167.