Home ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ ఓడిన బెంగళూరు

మళ్లీ ఓడిన బెంగళూరు

RCB

పుణె: వేదికగా ఐపిఎల్‌లో పుణెతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు, పుణెను 157 పరుగులకే కట్టడి చేసింది.

అనంతరం 158 పరుగుల లక్షంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆర్‌సిబి ఏ దశలోనూ టార్గెట్ దిశగా పయనించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి(55) పరుగులతో ఒంటరి పోరాటం చేసిన మిగిలిన బ్యాట్స్‌మెన్ల నుంచి ఆయనకు సహకారం లభించలేదు.

దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో బెంగళూరు ఈ ఐపిఎల్ సీజన్ నుంచి దాదాపు నిష్క్రమించినట్లై. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 3, ఫెర్గూసన్ 2, ఉనద్కత్, క్రిస్టియన్, సుందర్ తలో వికెట్ తీశారు.