Search
Sunday 23 September 2018
  • :
  • :

పుణె పంజా విసిరింది..

రాణించిన రహానె, త్రిపాఠి..
ఛేదనలో కుప్పకూలిన కోహ్లిసేన

Pune

బెంగళూరు: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా ఆదివారమిక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ 27 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధిం చింది. పుణె నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోహ్లిసేన పేలవ ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో పుణెకు రెం డు పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టికలో పుణె 5వ స్థానంలో నిలి చింది. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి చేసి బెంగళూరకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిం చింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, పుణె ఓపెన ర్లుగా బ్యాటింగ్ చేపట్టిన అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి మంచి శుభారం భాన్ని అందించారు.

రహానె (30), త్రిపాఠి (31) పరుగులతో అధ్భుతంగా రాణించి తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రహానె బద్రీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కాగా, త్రిపాఠి నెగీ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరి స్థానంలో వచ్చిన ధోనీ (28) వా ట్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27) పరుగులతో అరవిం ద్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. మిగతా ఆటగాళ్లలో మనోజ్ తివారీ (27) పరుగులు చేయగా, క్రిస్టేయిన్ (1), బెన్ స్టోక్స్ (2), శార్దూల్ ఠాకూర్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జయదేవ్ (2) నాటౌట్‌గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో మిల్నె, అరవింద్ రెండు వికెట్లు తీసుకోగా, బద్రీ, వాట్సన్, నెగీ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం పుణె నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు ఓపె నర్లలో మన్‌దీప్ సింగ్ ఆదిలోనే చేతులేత్తేశాడు. మరో ఓపెనర్ కెప్టెన్ విరాట్ కోహ్లి (28) డెవిలియర్స్ (29), కేదార్ జాదవ్ (18), షేన్ వాట్సన్ (14), బిన్ని (18), నెగి (11), మిల్నే (2), బద్రీ (0) పరుగులు చేయగా, అరవింద్ (6), చాహల్ (1) నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి బెంగళూరు 134 పరుగులు చేసి పరాజయం పాలైంది. కాగా, పుణె బౌలర్లలో స్టోక్స్ రెండు వికెట్లు, శార్దూల్ మూడు వికెట్లు, ఉన ద్కట్, తాహిర్ తలో వికెట్ తీసుకున్నారు.

పుణె ఇన్నింగ్స్: రహానె (బి) బద్రీ; 30, త్రిపాఠి (సి) కోహ్లి (బి) నెగీ; 31, స్టీవ్ స్మిత్ (బి) అరవింద్ ; 27, ధోనీ (బి) వాట్సన్; 28, బెన్ స్టోక్స్ (బి) మిల్నె; 2, క్రిస్టేయిన్ (సి) మన్‌దీప్ (బి) అరవింద్; 1, ఠాకూర్ (సి) డెవిలి యర్స్ (బి) మిల్నె; 0, తివారి రనౌట్ (కోహ్లి/జయదేవ్); 27, జయదేవ్ నాటౌట్; 2. ఎక్స్‌ట్రాలు: 13. మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లు) 161 పరు గులు. వికెట్ల పతనం: 1-63, 2-69, 3-127, 4-127, 5-129, 6-130, 7-130, 8-161. బెంగళూరు బౌలర్లు: మిల్నె 4-0-27-2, బద్రీ 4-0-32-1, అరవింద్ 4-0-29-2, వాట్సన్ 4-0-44-1, నెగీ 3-0-12-1, చాహల్ 1-0-11-0.

బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి (సి) రహానె (బి) స్టోక్స్ ; 28, మన్‌దీప్ సింగ్ (సి) ధోనీ (బి) ఠాకూర్ ; 0, డివిలియర్స్ స్టంప్ ధోనీ (బి) తాహిర్ ; 29, కేదార్ జాదవ్ (బి) ఉనద్కట్ ; 18, షేన్ వాట్సన్ (బి) స్టోక్స్ ; 14, బిన్ని (బి) ఠాకూర్ ; 18, నెగి (సి) త్రిపాఠి (బి) ఠాకూర్ ; 10, మిల్నే (బి) స్టోక్స్ ; 2, బద్రీ (బి) ఉనద్కట్ ; 0, అరవింద్ నాటౌట్ ; 6, చాహల్ నాటౌట్ ; 1. ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లు) 134 పరుగులు. వికెట్ల పతనం: 1-14, 2-41, 3-70, 4-91, 5-101, 6-123, 7-125, 8-126, 9-132. పుణె బౌలర్లు : ఉనద్కట్ జాదవ్ 4-0-25-2, ఠాకూర్ 4-0-35-3, క్రిస్టేయిన్ 4-0-26-0, స్టోక్స్ 4-0-18-3, తాహిర్ 4-0-27-1.

Comments

comments