Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

అవిభక్త కవలల శస్త్రచికిత్సలో రిస్క్

veena-vaaniమన తెలంగాణ/ హైదరాబాద్ : అవిభక్త కవలల శస్త్రచికిత్సలో 80 రిస్క్ ఉందని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.సురేష్‌కుమార్ తెలి పారు. ఆదివారం నగరంలో జరిగిన పీడియాట్రిక్ హెమటా లజీ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీణ-వాణిలకు సంబంధించిన మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా బృందం ముందుకొచ్చిందని, ప్రస్తుతం అవిభక్త కవలల వైద్య రిపోర్టులను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. వీణ – వాణిల శస్త్రచికిత్స, వారిని నీలోఫర్‌లో కొనసాగించడమా? లేదా తరలిం చడమా తదితర అన్ని విషయాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

Comments

comments