Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దాణా కుంభకోణంలో లాలూ దోషి

LALU

రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌యాదవ్‌ను దోషిగా తేలుస్తూ రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పును వెలువరించింది. దాణా కుంభకోణంలో రూ.900 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం లాలూను రాంచీ జైలుకు తరలించారు. సిబిఐ కోర్టు ఈ కేసులో జనవరి 3న లాలూకు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కుంభకోణం 1991-96 మధ్య వెలుగు చూసింది. దేవ్‌గడ్ ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.86లక్షల రూపాయలు విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మాజీ సిఎంలు లాలూ, జగన్నాథ్ మిశ్రా సహా 31 మందిపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు 17 మందిని దోషులుగా ప్రకటించింది. మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. 1997 అక్టోబర్ 27న కోర్టులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.  రాంచీ సిబిఐ కోర్టు తీర్పుతో బిహార్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RJD Chief Lalu Prasad Yadav is convicted in the feeding Scam

Comments

comments