Home జాతీయ వార్తలు హీరోగా తేజ్ ప్రతాప్ యాదవ్

హీరోగా తేజ్ ప్రతాప్ యాదవ్

RJD Leader Tej Pratap Yadav Act as Hero in Bollywood film

పాట్నా : ఆర్‌జెడి చీఫ్, బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ హీరోగా ఓ బాలీవుడ్ సినిమా రాబోతోంది. తాను నటిస్తున్న ‘ రుద్ర : ది అవతార్ ’ ఫస్ట్‌లుక్‌ను తేజ్ ప్రతాప్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 2016లో తేజ్ ప్రతాప్ బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో బోజ్‌పురి సినిమాలో సిఎం పాత్రలో నటించారు. ఇప్పుడు ‘ రుద్ర : ది అవతార్ ’ సినిమాతో తొలిసారి హిందీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. తేజ్, ఆయన సోదరుడు తేజస్వియాదవ్‌లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. తేజ్ వివాహం గత నెల ఘనంగా జరిగింది.

RJD Leader Tej Pratap Yadav Act as Hero in Bollywood film