Search
Monday 24 September 2018
  • :
  • :

సమయానికి వైద్యం అందక ఆర్‌ఎంపి వైద్యుడు మృతి

RMP Doctor

దహెగాం: మండలం కేంద్రంలో ఆర్‌ఎంపిగా పనిచేస్తున్న రాంటేంకి మురళీక్రిష్ణ (45) సమయానికి వైద్యం అందక మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మురళీక్రిష్ణ శనివారం ఉదయ నుంచి తన క్లినిక్‌లో రక్తపు వాంతులు చేసు కుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి  తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు, వైద్యాధికారి ఇంద్రావతికి విషయం తెలిపి ఆమె సూచనల మేరకు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో  సిబ్బంది అవ్వాల్ అంబులెన్సులో బెల్లంపల్లికి తరలించారు.మార్గ మధ్యలో వైద్య రాలు మురళీక్రిష్ణను పరిశీలించి ఆసుపత్రికి చేరుకున్నారు.

మురళీక్రిష్ణను బెల్లంపల్లి అసుపత్రికి తరలించి వైద్యం అందించే క్రమంలో మురళీక్రిష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ విషయంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యరాలు అందుబాటులో ఉంటే మురళీక్రిష్ణ బ్రతికేవాడని ఉద యం తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందకనే బెల్లంపల్లి తరలించారని వైద్యురాలు సమయపాలన పాటించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదని స్థానికులు ఆరోపి స్తున్నారు. విషయం తెలుసుకున్న ఎఎస్‌ఐ యాదవ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు.

ఈ విషయంపై ఎంపిపి చిలువేరు కల్పన , జడ్పిటిసి లావుడె సుజాత , స్థానిక సర్పంచ్ చిలువేరు జయప్రద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు వైద్యాధికా రితో మాట్లాడుతూ మీరు సమయ పాలన ఎందుకు పాటించడంలేదని, రోజు విధు లకు వస్తున్నారా, హజరు పట్టిక చూపించండి అని ఆరా తీశారు. తహసీల్దార్ బికర్ణ దాస్ అసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించి నివేదికను ఉన్నత అధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ రూరల్ సిఐ రమేష్‌బాబు ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేయించారు.

మంచి వైద్యున్ని కోల్పోయం: స్థానికులు
మంచిర్యాల జిల్లాలోని రామక్రిష్ణపుర్‌కు చేందిన అర్‌ఎంపీ వైద్యులు గత కొన్ని సంవత్సరాలుగా లగ్గాం గ్రామం, మండల కేంద్రంలో క్లినిక్ ఏర్పాటు చేసుకొని అందరితో కలివిడిగా ఉంటు ప్రజలకు వైద్యం అందించేవాడు. అనారోగ్యంతో ఆయన మృతి చేందడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల విచారణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో జరిగిన సంఘటనపై ఇంచార్జి డిఎం ఆండ్‌హెచ్‌వో సీతారాం నాయక్ విచారణ చేపట్టారు. మురళీక్రిష్ణకు వైద్యం అందించిన స్టాప్ నర్సు వనిత, వైద్యాధికారి ఇంద్రావతి, సిబ్బందిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బందిని సంఘటనపై విచారణ చేపట్టినట్లు నివేదికను డిఎంఅండ్ హెచ్‌ఒ, కలెక్టర్‌కు అందివ్వనున్నట్లు తెలిపారు.

Comments

comments