Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆర్‌టిసి బస్సు, టిప్పర్ ఢీ

accident

25 మందికి తీవ్ర గాయాలు, టిప్పర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్

పుల్‌కల్: నాందెడ్- ఆకోలా జాతీయ రహదారిపై ఆర్‌టిసి బస్సు, టిప్పర్ ఢీ కొని 25 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయలైన సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా, శివ్వంపేట సమీపంలో  చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం….నారాయణఖేడ్ డిపోకు చెందిన టిఎస్ 15 యు ఎ6098 నెంబర్ గల ఆర్‌టిసి బస్సు హైదారాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న క్రమంలో శివ్వంపేట వద్ద ఎదురుగా వస్తున్న టిఎస్ 15యుసి 1359 నెంబర్ గల టిప్పర్‌కు ఢీ కొట్టింది. బస్సులో ప్రయణిస్తున్న 65 మంది ప్రయాణికులలో 25 మందికి తీవ్ర గాయాలయ్యయి. వీ రిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. టిప్పర్ డ్రైవర్ బస్వరాజ్  కుడి కాలు స్టీరింగ్‌లో  ఇరుక్కుపోయిం ది. స్థానికులు బయటకు తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో మూడు గంటలపా టు నరకయాతన అనుభవించాడు. చివరికి పోలీసులు జెసిబి సహాయంతో బయటికి తీసి సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించా రు. మూడు గంటలపాటు రోడ్డపై ప్రమాదానికి గురైన వాహనాలు ఉండడంతో ఆరు కీలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయా యి. పుల్‌కల్, జోగిపేట ఎస్‌ఐలు సత్యనారయణ,పరమేశ్వర్‌గౌడ్ లు ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాలను సాగనంపారు. ఆర్‌టిసి అధికారులు అక్కడకు చేరుకొని సంఘటన వివారాలు తెలుసుకున్నారు.బస్సు డ్రైవర్ గౌస్ పరారీలో ఉన్నాడు.ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

Comments

comments