Home నిజామాబాద్ ప్రయాణికుడి కాలు పైకి వెళ్ళిన ఆర్‌టిసి బస్సు

ప్రయాణికుడి కాలు పైకి వెళ్ళిన ఆర్‌టిసి బస్సు

Untitled-1nzb

మన తెలంగాణ / కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం బస్టాండ్‌లో ప్రయాణికుడి కాలుపై నుంచి ఆర్.టి.సి బస్సు వెళ్లింది ఎస్.ఐ ము రళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం కోజన్ కొత్తూర్ గ్రా మానికి చెందిన గంగాధర్ గౌడ్ కమ్మర్‌పల్లి బస్టాండ్‌లో నిజామాబాద్ వెళ్ళేందుకు బస్సు ఎక్కుతుండగా కాలుజారి పడ్డాడు. ఆయన కుడి కాలు పై నుండి బస్సు ముందు టైరు వెళ్ళింది. గంగాధర్ కాలు నుజ్జునుజ్జు అ యింది. జగిత్యాల్ జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వా ఆసుపత్రికి 108 వాహనంలో గంగాధర్‌ను తీసుకెళ్ళరు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ మురళి తెలిపారు.