Search
Monday 24 September 2018
  • :
  • :

ఆటోను ఢీకొట్టిన తుఫాన్…

accident

కడ్తాల్: హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై కడ్తాల్ మండల కేంద్రంలో తలకొండపల్లి కూడలి వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ సుందరయ్య  తెల్పిన వివరాల ప్రకారం…తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి పంచాయతీ కోమటికుంట తండాకు చెందిన మూడవత్ దేవ్యా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో సోమవారం తెల్లవారు జామున  హైద్రాబాద్ జల్‌పల్లి గ్రామానికి బయలు దేరాడు. మార్గమధ్యలో కడ్తాల్ పెట్రోల్ పంపు వద్ద ఆటోలో డీజీల్ పోయించుకుని పెట్రోల్ బంకు నుంచి బయటికి వస్తుండగా కడ్తాల్ నుంచి ఆమనగల్లు వైపు వెల్తున్న క్రూయిజర్ వాహనం ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మూడవత్ దేవ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు శివ, లక్యా, సక్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆమనగల్లు ఆసుపత్రికి తరలించారు.

Comments

comments