Search
Monday 24 September 2018
  • :
  • :

సీతారాంపురం వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి

CAR---TREE

భద్రాద్రి కొత్తగూడెం : టేకులపల్లి మండలం సీతారాంపురం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కొత్తగూడెంకు చెందిన చిలుక పురుషోత్తం(55)గా గుర్తించారు. వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Road accident at Sitarampuram: One Person died

Comments

comments