Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి

Road-Accident

టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది చనిపోయారు. ఒక మినీ బస్సు పికప్ ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియా పట్టణానికి 120కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్నర్ స్టేట్ పార్క్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని న్యూబ్నౌఫెల్స్‌కు చెందిన ఫస్ట్ బాప్టిస్ట్ చర్చికి సంబంధించి న 14మంది వృద్ధులు ఒక వేడుకలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా మినీ బస్సును పికప్ ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Comments

comments