Home తాజా వార్తలు నాగార్జున్‌సాగర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు మృతి

నాగార్జున్‌సాగర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు మృతి

Accidentనల్గొండ : నాగార్జున్‌సాగర్ దయ్యాలగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విధులు నిర్వహిస్తున్న పోలీసులుపైకి లారీ దూసుకెళ్లిన ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు, ఓ పౌరుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోల్తాపడ్డ గడ్డి ట్రాక్టర్‌ను తొలగిస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో నాగార్జున్‌సాగర్ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.