Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం…

Road Accident In Nalgonda District
త్రిపురారం: ఆర్ టిసి కి చెందిన బస్సు కారు ను ఢీకొట్టిన సంఘటన త్రిపురారం మండలం చెన్నాయిపాలెం వద్ద చోటు చేసుకుంది. గురువారం అడవి దేవులపల్లి నుండి మాటూరు మీదుగా మిర్యాలగూడకు వస్తున్న టిఎస్05జడ్0140 నెంబర్‌గల ఆర్ టిసి బస్సు అడ విదేవులపల్లి వైపు వెళ్తున్న ఎపి24ఎక్యూ0874 నెంబర్‌గల కారును చెన్నాయిపాలెం మూల మలుపు వద్ద ఢీకొట్టింది. ఇరువురు డ్రైవర్‌లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. సంఘటనా సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం కొంత పాడైయింది. స్వల్ప గాయాలతో కారులో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

Comments

comments