Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఉత్తరాదిన కాలుష్యపు కాటు

Road-accident

తోడైన దట్టమైన పొగమంచు ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాల వరుస ప్రమాదాలు, పలువురికి గాయాలు రాజధానిలో స్కూళ్ల మూసివేత పంజాబ్ ప్రమాదంలో 9మంది యువకుల దుర్మరణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో ప్రమాదకర స్థాయి కి చేరిన వాయు కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఉదయం దట్టమైన పొగ కమ్ముకుంది. వెలుతురు సరిగా లేక పోవడంతో యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై 13 వాహ నాలు ఒకదానికి మరొకటి ఢీకొని ఆరుగురికి గాయాల యినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ సమీపంలో ఎక్స్‌ప్రెక్స్ వేకు ఇరు వైపుల వెలుతురు సరిగా లేక పోవడంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొట్టా యని దన్‌కౌర్ స్టేషన్ ఇంచార్జి ఫార్మూద్ అలీ పుందిర్ తెలిపారు.

ఆగ్రా వైపు వెళ్తున్న ఐదు వాహనాలు, ఢిల్లీ వైపు వెళ్తున్న ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయని తెలిపారు. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రాథమిక చికిత్స అనంతరం వారు డిశ్చార్జి అయినట్లు పుందిర్ తెలిపారు. ఘటనా స్థలాల్లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించడంతోపాటు మరిన్ని రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు గౌతమ్‌బుద్ నగర్ రూరల్ ఎస్‌పి సునితి తెలిపారు.

మంచుతో పంజాబ్‌లో ఘోర ప్రమాదం

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. దట్టంగా అలుముకున్న పొగమంచు, వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో దాదాపు 14 మంది విద్యార్థులు వేరే బస్సు కోసం భటిండా- ఛండీగఢ్ హైవే రోడ్డు పక్కన నిలబడ్డారు.

అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును ఢీ కొట్టిన తర్వాత ఆ వాహనం విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. దీంతో దాదాపు 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా రహదారి కనిపించకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Comments

comments