Home తాజా వార్తలు ఆటో బోల్తాపడి… మహిళ మృతి

ఆటో బోల్తాపడి… మహిళ మృతి

Road Accident సంగారెడ్డి:  ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులలో సోమవారం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ కుక్కను తప్పించబోగా… ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా… మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Road Accident In Sangareddy District