Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నెత్తురోడుతున్న రోడ్లు

Road Accidents in Kamareddy District

మన తెలంగాణ/కామారెడ్డి: ప్రతిరోజు రోడ్లన్ని రక్తసిక్తం అవుతూ అమూల్యమైన నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో రోజుకు సగటున రెండు రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు మితిమిరిన వేగం, మద్యం మత్తు, నిద్రలేమి కారణాలుగా నిలుస్తున్నాయి. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి హైవే బైపాస్ వద్ద 20 అడుగుల ఎత్తు నుండి బైకు ఎగిరిపడి గుంతలో పడి యువకుడు మరణించాడు. మిత్రుడి ఫంక్షన్‌లో పాల్గొని అర్ధరాత్రి డ్యూకు 200 సిసి బైకు పై నుండి రోడ్డు కిందికి బోల్తాపడి గాయాల పాలై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్క డో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగు తూ ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా యి. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం యువత చనిపోతుంది. రోడ్లపై వాహనాల వేగం బైక్‌ల వేగం అధికం కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కర్ణాటకకు చెందిన వ్యాపారి ఉగ్రవాయి మైసమ్మ మలుపు వద్ద కారు బోల్తా పడి మృతి చెందాడు. ఆయనతో పాటు మరో వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నాడు. అం చనూరు గ్రామానికి చెందిన 55 ఏళ్ల రైతు వెంకటి పొలం వద్దకు సైకిల్ పై వెల్తుండగా వెనుకనుండి వచ్చిన బైకు డీకొట్టి మృత్యువాత పడ్డారు. దొమకొండకు చెందిన వృద్దురాలు రోడ్డు దాటుతుండగా మాచారెడ్డి బైకు డీకొనడంతో ప్రమాదంలో గాయపడి చనిపోయారు. భిక్కనూరు మండ లం బిటియస్ హైవే వద్ద పలు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు వ్యక్తులు ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. జం గంపల్లి బైపాస్ వద్ద జరిగిన ప్రమాదాలలో రిటైర్డ్ హెడ్‌మాస్టార్ రాజిరెడ్డి చనిపోయారు. క్రిష్ణమందిర్ హైవే వద్ద రోడ్డు దాటుతున్న ప్రభుత్వ ఉపాద్యాయులు మానిక్ సంగమేశ్వర్ గ్రామవాసి మానికిరావు చనిపోయారు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు చనిపోతు కుటుంబాలు వారిపై అధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నర్సన్నపల్లి బైపాస్, టెక్రియాల్ బైపాస్, రామారెడ్డి బైపాస్ వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పదుల సంఖ్యలో యువకులు, వ్యక్తులు కాల్లు, చేతులు విరగోట్టుకుని వికలాంగులు అవుతున్నారు. జిల్లాలో ఆటొల ప్రమాదాలు కూడా అధికం గా జరుటుతున్నాయి. లైసెన్సు లెని ఆటొలు, ట్రాక్టర్ల డ్రైవర్ల మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో యువకులు ఎక్కువగా చనిపోతున్నారు.

Comments

comments