Home నాగర్ కర్నూల్ అలా తీశారు… ఇలా వదిలేశారు

అలా తీశారు… ఇలా వదిలేశారు

Dug-Pits

సిసిరోడ్డు వేశారు అంచుల వెంబడి మట్టిని పోయడం మరిచారు
మురుగు కాలువలు తవ్వరు వృథాగా వదిలేశారు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిథులు
ఇబ్బందులో బిసి కాలనీవాసులు

ఉప్పునూతల: ఉప్పునుంతల మండల కేంద్రంలోని బిసి కాలనీలో సిసి రోడ్డును వేసి నాలుగు నెలలు గడుస్తున్న సిసిరోడ్డు పక్కల మట్టిని పో యకుండా వదిలేశారని కాలనీ వాసులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలనీలో సిసిరోడ్డు నిర్మించి రోడ్డు పక్కలమట్టిని పోయక పోవడంతో వృద్దులు మరియు చిన్నపిల్లలు రోడ్డును ఎక్కలేక, దిగలేక ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సెప్టెంబర్ 2016లో సిసిరోడ్డును వేశారు. అదేవిధంగా సిసిరోడ్డు వెంబడి మురుగు కాలువ కోరకు యంత్రాలతో కాలువలను తీసి నాలుగు నెలలు గడుస్తున్న పట్టించుకోనెవారు కరువయ్యరని అంటున్నారు.

మురుగు కాలువలునిర్మిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరుకుడా పట్టించుకోవడం లేదని, సిసి రోడ్డు అంచులు చాలా పదునుగా ఉండటం వలన గాయాలువుతున్నాయాని, ఆ కాలువలో చిన్నపిల్లలు పడి గాయాల పాలువుతున్నారని, వృద్దులు సిసిరో డ్డును ఎక్కలేక నానా అవస్థలు పడుతున్నామని కాలని వాసులు వ్యక్తంచేస్తున్నారు. మురుగు కాలువ కోరకు తీసిన గుంతలలో మురుగు నీరు ఏటు వెళ్ళకుండా ఒకేదగ్గరా నిలిచి దోమలు, ఈగలు అధికమవుతున్నాయాని, దుర్వాసన వెదజల్లుతుందని అవాసన భరించలేకపొతున్నా మాని కాలనివాసులు అంటున్నారు. ఇంటి, నల్లా పన్నులు కోరకు ఇంటి వద్దకు గ్రామపంచాయతి అధికారులు వచ్చినప్పుడు ఎప్పుడు అడిగినా రేపు చేయిస్తామాని బిల్లులు మాత్రం వసూల్లు చేసుకోని పోతున్నారు కాని మాబాధలు మాత్రం ఏవ్వరు పట్టించుకొవడం లేదని మడ్డిపడుతున్నారు.

వ్యవసాయపొలంనుండి దాన్యం, ఎరువులు తీసుకురావలంటె ఇంటి వద్దకు తీసుకురాలేక రోడ్డుపైనే వాహనాలను మరియు ఎడ్లబండ్లను నిలిపి ఇంటివరకు మోయవలసివస్తుందని, రాత్రివేళ్ళల్లో వాహనాలను ఇంటివద్దకు తీసుకురాలేక రోడ్డుపైనే ఉంచవలసివస్తుందని అంటున్నారు. అదేవిదంగా సిసిరోడ్డు అంచులకుండా కాలువలనిర్మాణంకోరకు తీసినప్పుడు లోపల ఉన్న మంచినీరు వచ్చే పైపులు పూర్తిగా ద్వంసం అయిన ఎన్నిసార్లు వాటర్ మ్యాన్‌కు చెప్పిన వినెవారు కురువాయ్యరని పలువురు కాలని వాసులు అంటున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిథులు ప్రత్యేక చోరవ తీసుకోని పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.