Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు మరమ్మతుల కోసం సడక్ యాప్‌

Road repairs are possible with the App
శంషాబాద్: సాంకేతిక విజ్ఞానం అభివృద్దితో ప్రపంచం గ్రామంగా మారింది. ఎక్కడి నుంచైనా ఎలాంటి సమాచారమైన, ఎంతటి పనినైనా చేయగల విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీని వాడుటలో ప్రభుత్వాలు కూడా ముందుంటున్నాయి. చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేకత, పారదర్శకత చాటేందుకు వైవిధ్యమైన ఆలోచనలను రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ సేవకు యాప్‌ల వినియోగాన్ని తీసుకురావడామే. ఈ ప్రయత్నంలో భాగమే మేరీ సడక్ యాప్. మీ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా గుంతల మయంగా ఉన్నాయా? ప్రతీ రోజు ఆ రోడ్డు గుండా ప్రయాణం నరక ప్రాయంగా ఉందా? రోడ్డు పరిస్ధితులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదా అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లను సంబంధిత అధికారులు పట్టించుకోకుంటే మేరీ సడక్ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలోని జెడ్పి రహదారులకు చాలా వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిధులు కేటాయిస్తుంటారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్దికి నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా సమకూర్చుతుంది.ఈ పథకం కింద నిర్మించిన రహదారుల ఫిర్యాదులను మాత్రమే యాప్ ద్వారా కేంద్రం స్వీకరిస్తుంది. గ్రామీణ రోడ్ల పరిస్ధితులపై యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే కేంద్ర యంత్రాంగం స్ధానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి చొరవ తీసుకుంటుంది.

యాప్ డౌన్లోడ్ ఇలా… గూగుల్ ప్లెస్టోర్ నుండి మేరీ సడక్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే మేరి సడక్ యోజన ఐకాన్ కనిపిస్తుంది. అందులో ఫిర్యాదు దారుడి పేరు, సెల్‌ నెంబర్ అనే వివరాలను మెయిల్ ఐడీ పాస్వర్డ్ ఫిడ్ బ్యాక్ కాలమ్ ఎంటర్ చేయగానే రిజిస్టేషన్ పూర్తవుతుంది. వివరాలు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ మొబైల్ నంబర్‌తో యాప్ స్వీకరించిన అనంతరం జీపిలోకి లాగిన్ కావచ్చు. లాగిన్ అవ్వగానే యాడ్‌షెడ్‌ర్ ఎస్కు ఈ యాప్ అను బ్యాక్‌వ్యూ అండ్ ఆప్లోడ్ బ్యాక్ ప్రొఫైల్ సంధానించడంతో మీరు పంపిన కాలమ్స్ స్క్రీన్నై కనిపిస్తాయి. ఏ రహదారి పరిస్ధితిని రోడ్డు ప్రధాన మంత్రి గ్రామ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల నకుంటున్నారో దాన్ని సడక్ యోజన రహదారి కాని ఫోటో తీయాలి. లేదా మీఫోన్ గ్యాలరీలో ఆ రహదారి పక్షంలో ఈ విషయాన్ని ఫిడ్ ఫోటో ఉన్న ఆప్లోడ్ చేయవచ్చు. ఫోటో ఆఫ్లోడ్ బ్యాక్లో తెలియజేస్తారు. వివరాలు చేసి గ్రామం, ఇతర పూర్తి వివరాలను నమోదు చేసి సక్రమంగా లేకపోయినా వారి సెండ్ బటన్ నొక్కగానే సమస్య నేరుగా ప్రధాన మంత్రి నుండి సమాచారం అందుతుంది. గ్రామీణ సడక్ యోజన విభాగం ద్వారా నేరుగా ప్రధాన మంత్రి దృష్టికి వెళ్తుంది. దీంతో రోడు సమస్య పరిష్కారానికి మీవంతు ప్రయత్నం చేసినట్లవుతుంది. దీంతో సమస్యకు పరిష్కారం అవుతుంది.

Comments

comments