Home మంచిర్యాల హైటెక్ రోడ్లకు అన్నీ అతుకులే ?

హైటెక్ రోడ్లకు అన్నీ అతుకులే ?

అనతికాలంలోనే శిథిలావస్థకు

Roads

కాసిపేట: కోట్లాది రూపాయలు వెచ్చించి వేస్తున్న రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపంతో అందమైన రహాదారులు అనతికాలంలోనే అతుకుల రోడ్లుగా మారిపోతున్నా యి. ప్రభుత్వం రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి రహ దారుల నిర్మాణలు చేపడుతుండగా నిర్మాణం సమయంలో సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వ నియమ నిబంధలను విస్మరించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రాత్రివేళ రోడ్ల నిర్మాణాలు చేపట్టనుండడంతో రహదారులు వేసిన సమయంలో అందంగా మెరిసిన తారు రోడ్లు కొద్ది కాలం లోనే గుంతల మయం అవుతున్నాయి. వాటికి మళ్లీ మరమ్మత్తుల పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తు రోడ్లకు అతుకులు వేస్తుండడంతో అందమైన రహదారులు కళా విహీనంగా మారు తున్నాయి.

సోమగూడెం నుండి బెల్లంపల్లి వరకు, సోమగూడెం నుండి కాసిపేట వైపుకు ఆర్‌అం డ్‌బి శాఖ నేతృత్వంలో తారు రోడ్లు వేసారు. వేసిన రోడ్లు అనతి కాలంలోనే చెడిపోవడంతో మళీ మరమ్మతుల పేరిట అతుకులు వేయడంతో రోడ్లు ఎత్తు పల్లాలుగా మారిపోయి ప్రయాణానికి ఇబ్బందిగా మారిందని వాహానదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిం చి రహదారుల నిర్మాణం చేపడుతుండా సంబందిత శాఖ అదికారులు నాణ్యత విషయంలో పట్టించుకోక పోవడంతో వల్లే రోడ్లు కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మరమ్మత్తులను కూడా ఇష్టానూసారంగా చేపడుతున్నారనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. రోడ్లు నిర్మాణం చేపట్టే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించని సదరు కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని, నిర్లక్షం వహించే సంబంధిత అదికారులపై కూడా క్రమ శిక్షణ చర్యలు చేపట్టినట్లయితే రోడ్లు బాగుపడతాయని పలువురు సూచిస్తున్నారు.