Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో చెడిపోతున్న రోడ్లు

Tractor1కాల్వశ్రీరాంపూర్: కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో తారురోడ్లు చెడిపోతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో తారురోడ్లు నిర్మాణం చేస్తుంటే ట్రాక్టర్లు కేజీవీల్స్‌తో తిరగడం వల్ల రోడ్లపై గుంతలు పడి వాహన దారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. మండలంలోని కిష్ఠపేట్, మీర్జంపేట్, చిన్నరాతుపల్లి, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, గంగారం, కూనారం తదితర గ్రామాల శివారుల్లో గల తారురోడ్లపై కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పొలాల వద్దే కేజ్‌వీల్స్ మార్చుకోవాలని లేదా పట్టీలు అమర్చుకోవాలనే నిబంధనలను ట్రాక్టర్ యజమానులు పట్టించుకోవడంలేదు.

రోడ్లపై తిరుగుతున్న కేజీవీల్స్ ట్రాక్టర్లును నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాగం ఏమాత్రం దృష్ఠిసారించడం లేదు. దీనితో రోడ్లు వేసిన కొద్దిరోజులకే తారురోడ్డుపై గుంతలు పడుతున్నాయి. రోడ్డుపై కేజీవీల్స్ గీతల వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాధనంతో నిర్మిస్తున్న తారురోడ్లను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాగంపై ఎంతైనా ఉంది. యేసంగా వరినాట్లు మొదలు కావడంతో మళ్లీ తారురోడ్లపై కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు దర్శన మిస్తున్నాయి. ఇప్పటికైనా సంభందిత ప్రభుత్వాధికారులు స్పందించి తారురోడ్లపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు తిరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్లకు హాఫ్ కేజ్‌వీల్స్ వాడడం ద్వారా అటు రోడ్లకు, ఇటు యజమానులకు సులభంగా ఉంటుందని సూచిస్తున్నారు.

కేజ్‌వీల్స్‌తో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్

Comments

comments