Home తాజా వార్తలు సంగారెడ్డిలో దారి దోపిడీ

సంగారెడ్డిలో దారి దోపిడీ

ROBBORY1సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులో సోమవారం అర్ధరాత్రి దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇషాక్ కారులో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వస్తుండగా గణేష్‌గడ్డ వద్దకు రాగానే ముగ్గురు దుండగులు ఇషాక్ కళ్లల్లో కారం చల్లి అతడి వద్ద ఉన్న రూ.50లక్షల నగదు అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్‌పి సుమతి పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు సుమతి తెలిపారు.